మార్కెట్లోకి ఇంటెక్స్ కొత్త డ్యూయల్ సిమ్ ఫోన్

By Prashanth
|

Intex

ఇంటెక్స్ టెక్నాలజీస్ శక్తివంతమైన బ్యాటరీతో కూడిన సరికొత్త డ్యూయల్ సిమ్‌ ఫోన్‌ను మార్కెట్లో ప్రకటించింది. పేరు ‘ఇంటెక్స్ ఓరా’(INTEX AURA). ధర రూ.1690. ఈ స్లీక్ డిజైనింగ్ ఫీచర్ హ్యాండ్‌సెట్ అన్ని వర్గాలు వినియోగదారులకు నచ్చుతుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఫోన్ కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 360 గంటల స్టాండ్‌బై),

16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

మొబైల్ ట్రాకర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, సౌండ్ రికార్డర్,

ఎఫ్ఎమ్ రేడియో విత్ ఎఫ్ఎమ్ రికార్డర్,

హిందీ ఇంకా ఇంగ్లీష్ భాషల సపోర్ట్,

ఫోన్‌బుక్ సామర్ధ్యం (500 ఎంట్రీల వరకు),

ఆటోకాల్ రికార్డ్, టార్చ్,

బ్లూటూత్, జీపీఆర్ఎస్/వాప్, రెడ్,

వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యం కానుంది,

ధర రూ.1690.

ఇంటెక్స్ సరికొత్త టాబ్లెట్ ‘ఆక్వా 5.0’

ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త టాబ్లెట్‌తో ముందుకొచ్చింది. ‘ఇంటెక్స్ ఆక్వా 5.0’పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను ఇంటెక్స్ వర్గాలు ఆవిష్కరించాయి. ధర రూ.9,999. ఈ ఫాబ్లెట్ మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంటెక్స్ ఆక్వా 5.0 స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల మల్టీ‌టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ప్ర్రాసెసర్: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), మెమెరీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ: వై-ఫై, 3జీ, బ్లూటూత్ 2.0, జీపీఎస్, బ్యాటరీ: 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ప్రీలోడెడ్ అప్లికేషన్స్: ఎన్‌క్యూ యాంటీ వైరస్, ఫ్లిప్‌కార్డ్, ఇండియా రైల్, నైంబజ్, స్కైప్ ఇంకా ఇతర పాపులర్ అప్లికేషన్స్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X