రూ.2999కే ఇంటెక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల బ్రాండ్ ఇంటెక్స్, ‘ఆక్వా కేఏటీ'(Aqua KAT) పేరుతో సరికొత్త ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్‌ను  ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ కనెక్టువిటీ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,999. బ్లాక్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ eBay.in  విక్రయిస్తోంది.

 రూ.2999కే ఇంటెక్స్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),  1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,  ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,  512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో), 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Intex Launches Entry Level Aqua KAT with 3G, KitKat At Rs 2,999. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting