Home
Mobile

ఊహించని ధరకే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్, అదనంగా రూ. 2,200 క్యాష్‌బ్యాక్

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది.

By Hazarath Aiah

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఫీచర్‌తో ఉదయ్' అనే సరికొత్త డివైస్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రూ.7,999 రూపాయల బడ్జెట్‌ ధరలో దీన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. కాగా ఈ ఫోన్‌ను విక్రయించేందుకు వివిధ రిటైల్ అవులెలెట్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్టు ఇంటెక్స్‌ ప్రకటించింది.అంతేకాదు రిలయన్స్‌ జియో ద్వారా 2,200 రూపాయల దాకా క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. ప్రస్తుత, కొత్త జియో కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. రూ.198 లేదా రూ.299 ప్లాన్ల రీచార్జ్‌ (44) లపై 50 రూపాయల విలువైన 44 క్యాష్‌బ్యాక్‌ వోచర్లను మై జియో​ యాప్‌ ద్వారా పొందవచ్చు.

intex uday

ఇంటెక్స్‌ ఉదయ్‌ ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌
1280 × 720 పిక్సల్ రిజుల్యూషన్‌
ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్‌ సిస్టం
1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
13 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా విత్‌ ఆటోఫోకస్‌ అండ్‌ ఫ్లాష్‌
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2800 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌‌తో ఇంటెక్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇంటెక్స్‌' భాగస్వామ్యంతో చౌక ధరలో 'ఆక్వా లయన్స్‌ ఎన్‌1' అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,649కే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కాగా ముందుగా వినియోగదారులు రూ.3,149 డౌన్‌పేమెంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి.తర్వాత 36 నెలలపాటు రూ.169తో రీచార్జ్‌ చేసుకోవాలి. కస్టమర్‌ 18 నెలల తర్వాత రూ.500, 36 నెలల తర్వాత రూ.1,000 క్యాష్‌ రిఫండ్‌ పొందొచ్చు. వినియోగదారుడు రూ.169 ప్లాన్‌ వద్దనుకుంటే ఇతర టారిఫ్‌లను ఎంచుకోవచ్చు.

అయితే తొలి 18 నెలల కాలంలో రూ.3,000 మొత్తానికి సమానమైన రీచార్జ్‌లను చేసుకోవాలి. అప్పుడు రూ.500 రిఫండ్‌ పొందొచ్చు. తర్వాతి 18 నెలల్లో మరో రూ.3,000 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. అప్పుడు రూ.1,000 రిఫండ్‌ వస్తుంది. ఇక ఆక్వా లయన్స్‌ ఎన్‌1 స్మార్ట్‌ఫోన్‌లో 4 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. దీంతో పాటు 'ఆక్వా ఏ4', 'ఆక్వా ఎస్‌' అనే మరో రెండు స్మార్ట్‌ఫోన్లను వరుసగా రూ.1,999గా, రూ.4,379 ధరల్లో మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

Best Mobiles in India

English summary
Intex Launches New Smartphone Uday, Partners With Multiple Retailers More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X