స్మార్ట్‌ఫోన్ లాంటి ఫీలింగ్!!

Posted By:

స్మార్ట్‌ఫోన్ లాంటి ఫీలింగ్!!

 

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ కానప్పటికి ఆ విధమైన అనుభూతికి లోను చేసే తత్వం ఈ మొబైల్ ఫోన్ సొంతం. ఇన్‌టెక్స్ సెన్స్ పేరుతో టచ్ స్క్రీన్ మొబైల్‌ తాజాగా ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. 3.2 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో 41 ఇంటర్నేషనల్ పాపులర్ గేమ్స్ ప్రిలోడ్ చేశారు.

క్లాసిక్స్ నుంచి ఫిక్షన్ వరకూ పలు పుస్తకాలను స్టోర్ చేశారు, ఈ ఫోన్ సెకండరీ స్టోరేజ్‌లో 500 వరకూ పుస్తకాలను సేవ్ చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ మెమరి 79 ఎంబీ, 4 జీబీ మైక్రో కార్డ్‌ ఉచితంగా పొందవచ్చు.

ఈక్విలైజర్, సౌండ్ రికార్డింగ్, టార్చ్, డ్యూయల్ కెమెరా (బాక్ కెమెరా 3 మెగా పిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 1.3 మెగాపిక్సెల్స్), మోషన్ సెన్సర్‌ వంటి ఆధునిక ఫీచర్లు. ధర రూ. 3,690.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot