జియోకు షాక్, రూ.700కే ఇంటెక్స్ ఫోన్

71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇంటెక్స్ టెక్నాలజీస్ నవరత్న పేరుతో 9 సరికొత్త ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో ఒక 4G-Volte స్మార్ట్ ఫీచర్ ఫోన్ కూడా ఉంది. ఈ తొమ్మిది ఫోన్‌లలో ఒకటి మాత్రేమే 4జీ వోల్ట్ మోడల్ కాగా, మిగిలినివి అన్ని 2జీ మోడల్సే. ఈ ఫోన్‌ల ధరలు రూ.700 నుంచి రూ.1500 మధ్య ఉంటాయి. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Intex Turbo+ 4G

ఇంటెక్స్ టర్బో + 4జీ

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, 4జీ వోల్ట్ నెట్‌వర్క్ సపోర్ట్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, KaiOS సాఫ్ట్‌వేర్, 2000mAh బ్యాటరీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ECO 102+

ఇక 2జీ ఫీచర్ ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి ECO సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్‌‌లను ఇంటెక్స్ లాంచ్ చేసింది. వాటిలో ఒకిటైన ECO 102+ మోడల్ 1.8 అంగుళాల QQVGA డిస్‌ప్లేతో వస్తోంది. కరెన్సీ చెక్ ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్, 800mAh బ్యాటరీ, 500కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీ, మైక్రోఎస్డీ స్లాట్ (ఎక్స్‌ప్యాండబుల్ అప్ టు 32జీబి), ఎఫ్ఎమ్ రేడియో, కెమెరా వంటి బేసిక్ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

ECO 106+

మరో మోడల్ ECO 106+, 1.8 అంగుళాల QQVGA డిస్‌ప్లేతో వస్తోంది. కరెన్సీ చెక్ ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్, 1000mAh బ్యాటరీ, 500కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీ, మైక్రోఎస్డీ స్లాట్ (ఎక్స్‌ప్యాండబుల్ అప్ టు 32జీబి) ఎఫ్ఎమ్ రేడియో, కెమెరా వంటి బేసిక్ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

ECO SELFIE

మరో మోడల్ ECO SELFIE డ్యుయల్ కెమెరా ఫ్లాష్ సపోర్ట్‌తో వస్తోంది. 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. GPRS/WAP వంటి సౌకర్యాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 1800mAh బ్యాటరీ, 1500 కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీ.

Turbo Shine

ఇంటెక్స్ తన ECO సిరీస్‌తో పాటు Turbo సిరీస్ నుంచి కూడా రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. వాటిలో ఒకటైన Turbo Shine మోడల్ తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 1400mAh బ్యాటరీ, మైక్రోఎస్డీ స్లాట్ (ఎక్స్‌ప్యాండబుల్ అప్ టు 32జీబి), ఎఫ్ఎమ్ రేడియో.

Turbo Selfie 18

మరొక ఫోన్ Turbo Selfie 18 డ్యుయల్ కెమెరా సపోర్ట్‌తో వస్తోంది. 1800mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్. 2000 కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీ.

Ultra 2400+, Ultra Selfie

ఇంటెక్స్ తన Ultra సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లను పరిచయం చేసింది. వీటిలో ఒక మోడల్ అయిన Ultra 2400+ 2.4 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 2400mAh బ్యాటరీ, 2000 కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీ. మైక్రోఎస్డీ స్లాట్ (ఎక్స్‌ప్యాండబుల్ అప్ టు 64జీబి). మరొక మోడల్ అయిన Ultra Selfie పవర్ ప్యాకుడ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తోంది. 3000mAh బ్యాటరీ సపోర్ట్, 2.8 అంగుళాల డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్.

Lions G10

ఇంటెక్స్ లాంచ్ చేసిన మరో హైఎండ్ ఫీచర్ ఫోన్‌లలో Lions G10 ఒకటి. 2.4 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 2000 కాంటాక్ట్స్‌కు సరిపడా ఫోన్‌బుక్ మెమురీని కలిగి ఉంది. 1450mAh బ్యాటరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex launches nine feature phones starting at Rs.700. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot