ఇంటెక్స్‌ నుండి 3 సిమ్‌ల ఫోన్‌

Posted By: Staff

ఇంటెక్స్‌ నుండి 3 సిమ్‌ల ఫోన్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ తయారీదారు ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ ట్రిపుల్‌ సిమ్‌ ఫోన్‌ 'ట్రై డూ'ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 32 జీబీ మెమొరీ(ఎక్స్‌పాండబుల్‌)తో మూడు సిమ్‌లు(జీఎస్‌ఎమ్‌+జీఎస్‌ఎమ్‌+సీడీఎమ్‌ఏ) కార్డులను కలిగి ఉండే ఈ ఫోన్‌ ధర రూ.3750. జీపీఆర్‌ఎస్‌ సౌకర్యంతో వస్తున్న ఈ ఫోన్‌ తెర 2.2 అంగుళాలుంటుంది. 1.3 మెగా పిక్జల్‌ కెమేరా, మొబైల్‌ ట్రాకర్‌, బ్లూటూత్‌, డ్యూయల్‌ మెమొరీ కార్డు స్లాట్లు(ఒక్కోటీ 16 జీబీ), 7 గంటల బ్యాటరీ లైఫ్‌తో పాటు ఇది మీ కంప్యూటర్‌లో వెబ్‌సర్ఫింగ్‌ చేయడానికి మోడమ్‌లానూ ఉపయోగపడుతుంది. ఇంటెక్స్‌ 2009లోనే తన తొలి ట్రిపుల్‌ సిమ్‌ ఫోన్‌ను విడుదల చేయడం జరిగింది.

Intex Triple SIM Phone Specifications:

2 inch TFT screen with 65K colors,
1.3 MP camera use as a webcame
Mobile tracker
Bluetooth
Memory card slot TF/Micro SD card up to 4 GB
Torch light
Auto call record.
FM Radio with recording

బ్యాటరీని కంటిన్యూస్‌గా వాడినట్లైతే బ్యాక్‌అప్ 7 గంటలు పాటు వస్తుంది. మొబైల్‌లో ఉన్న మూడు సిమ్ స్లాట్స్‌లలో రెండు జిఎస్‌ఎమ్ సిమ్‌లను, ఒకటి సిడిఎమ్‌ఎ సిమ్‌లను వేయడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక ఇండియాలో ఒక్క సంవత్సరం warranty కూడా ఇవ్వడం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting