3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఇంటెక్స్ ఆక్వా స్టార్ పవర్

Posted By:

శక్తివంతమైన బ్యాటరీతో ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ శుక్రవారం గోవాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా స్టార్ పవర్'ను విడుదల చేసింది. శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్ ధర రూ.7,490. ఈ ఫోన్ బ్యాటరీ అందించే బ్యాకప్ యూజర్లకు అంతరాయంలేని స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరువ చేస్తుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ మొబైల్ బిజినెస్ హెడ్ సంజయ్ కుమార్ కాలిరోనా తెలిపారు.

శక్తివంతమైన బ్యాటరీతో ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

ఇంటెక్స్ ఆక్వా స్టార్ పవర్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot