ఇంటెక్స్ నుంచి రెండు చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఎంట్రీస్థాయి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ దేశావాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ వివిధ వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావటం ఇటీవల మనం చూస్తున్నాం. తాజాగా ఈ బ్రాండ్ క్లౌడ్ ఎక్స్1+ ( Cloud X1+), క్లౌడ్ వై11 (Cloud Y11) పేర్లతో రెండు చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. క్లౌడ్ ఎక్స్1+ వేరియంట్ ధర రూ.3,000. క్లౌడ్ వై11 వేరియంట్ ధర రూ.5,000.

చవక ధర స్మార్ట్‌ఫోన్‌లతో ఇంటెక్స్ జోరు!

క్లౌడ్ ఎక్స్1+ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యుయల్ సిమ్, 3.5 అంగుళాల తాకేతెర, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్, గేమింగ్, బ్రౌజింగ్, ఆటో రోటేట్ ఫీచర్, 128ఎ:బి ర్యామ్, 256 ఎంబి రోమ్, 2 మెగా పిక్సల్ కెమెరా, అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్ ఆప్షన్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు (వాట్స్ యాప్, ఒపెరా మినీ). ధర రూ.3,000.

ఇంటెక్స్ క్లౌడ్ వై11 కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యుయల్ సిమ్, 4 అంగుళాల తాకేతెర, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి రోమ్, 2 మెగా పిక్సల్ కెమెరా, అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, ఫోన్ ధర రూ.5,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot