రూ.1999కే ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్

Posted By:

‘క్లౌడ్ ఎఫ్ఎక్స్' పేరుతో తన మొట్టమొదటి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటెక్స్ మొబైల్స్ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. ధర రూ.1,999.
ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆఫరేటింగ్ సిస్టం పై ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. అడాప్టివ్ యాప్ సెర్చ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌తో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర అప్లికేషన్‌లను డివైస్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసి ఉంచారు.

 రూ.1999కే ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్

ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల HVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (2జీ+2జీ),
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ (ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్),
1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పరిమాణం 115.9x62x11.8మిల్లీమీటర్లు,
బరువు 104 గ్రాములు.

బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానున్న ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌నుప్రముఖ రిటైలర్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ కొనుగోలు పై నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి ఉచిత డేటాను ఎయిర్‌సెల్ అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Intex Officially Releases First Firefox Smartphone Cloud FX at Rs 1,999. Read more in Telugu Gizbot.........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot