కేక పుట్టించే డ్యూయల్ సిమ్ ఫోన్!!

Posted By: Super

కేక పుట్టించే డ్యూయల్ సిమ్ ఫోన్!!

 

మతిపోగొట్టే డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను ఇంటెక్స్ సంస్థ డిజైన్ చేసింది. రాయల్ లుక్‌తో ఆకర్షణీయమైన శైలిలో రూపుదిద్దుకున్న ‘ఇంటెక్స్ రాయల్’ ఈ

హ్యాండ్‌సెట్ ‘సింప్లీ ది బెస్ట్’. ఫోన్ వెడల్పాటి స్ర్కీన్ 2.6 అంగుళాల పరిమాణాన్ని కలిగి QVGA టెక్నాలజీని ఒదిగి ఉంటుంది. వెనుక భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఫోన్ అదనపు మెమరీ 32జీబి. నిక్షిప్తం చేసిన జీపీఆర్ఎస్, బ్లూటూత్ వ్యవస్థలు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరిత బలోపేతం చేస్తాయి. ఈ సొగసరి హ్యాండ్‌సెట్ బరువు కేవలం 105 గ్రాములు. బ్యాటరీ టాక్‌టైమ్ 8 గంటలు, స్టాండ్‌బై 395 గంటలు. అంటే శ్రోత నిరంతరాయంగా 8 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు లేదా కాలింగ్ నిర్వహించుకోవచ్చు. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. పొందుపరిచిని ఆడియో, వీడియో ప్లేయర్లు మన్నికైన వినోదాన్ని పంచుతాయి. ధర అంచనా రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot