ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రచారకర్తగా హీరో దగ్గుబాటి రాణా

|

దేశవాళీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మైక్రోమాక్స్, కార్బన్ వంటి ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్‌లకు ప్రధాన పోటీగా అవతరించిన ఇంటెక్స్ బ్రాండ్ తన ఆక్వా శ్రేణి నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆగష్టు 12న బెంగుళూరులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆక్వా సిరీస్ ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు.

 
 ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రచారకర్తగా హీరో దగ్గుబాటి రాణా

ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ హీరో దగ్గుబాటి రాణా హాజరవుతుండటం మరో విశేషం. ఇదే వేదిక పై ఇంటెక్స్ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌ను పరిచయం చేయబోతోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చిన సమాచారం మేరకు ఇంటెక్స్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు రాణా ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇంటెక్స్ నుంచి విడుదల కాబోతున్న కొత్త ఆక్వా ఫోన్ ధర రూ.10,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ ఆగష్టులోనే ఇంటెక్స్, ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే సరికొత్త క్లౌడ్ ఎఫ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.2,000లోపు ఉంటుందని కంపెనీ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Intex Sends Out Invite for August 12 Event: New Aqua Smartphone to Launch in sub-10,000 Range. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X