బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఇంటెక్స్ సెన్స్ 3.0’

Posted By: Prashanth

బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఇంటెక్స్ సెన్స్ 3.0’

 

దేశీ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ తన కుటుంబంలోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను చేర్చింది. పేరు ‘ఇంటెక్స్ సెన్స్ 3.0’ధర రూ.3450. ఇంగ్లీష్, హిందీ భాషలను సపోర్ట్ చేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ప్రధానంగా యువతను దృష్టిలోఉంచుకుని డిజైన్ చేయబడింది.

ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

3.2 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్,

ఆటోకాల్ రికార్డ్,

కాలర్ గ్రూప్,

మొబైల్ ట్రాకర్,

ఈ-బుక్ రీడర్,

16జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ,

మీడియా ప్లేయర్,

ఎఫ్ఎమ్ రికార్డింగ్,

బ్యాటరీ మేనేజర్,

ప్రీలోడెడ్ గేమ్స్,

లోమో కెమెరా,

1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్‌బై 250 గంటలు).

ధర ఇతర వివరాలు:

గోల్డ్, సిల్వర్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఇంటెక్స్ సెన్స్ 3.0 లభ్యం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 15,000 ఇంటెక్స్ పంపిణీదారులు ఇంకా రిటైల్ అవుట్ లెట్‌ల‌లో ఈ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను రూ.3,450 ధరకు విక్రయిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot