ఇంటెక్స్ కొత్త మొబైల్ 2జి లోనే వీడియో కాలింగ్

By Super
|
Intex Technologies
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ది చెందింది అనడానికి మన అరచేతిలో ఉన్న మొబైలే నిదర్శనం. కొత్త కొత్త టెక్నాలజీలను అరచేతిలో నిక్షిప్తం చేయడానికి గాను అన్ని రకాల మొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మొబైల్ తయారీదారులు వారియొక్క కస్టమర్స్‌ని ఆకర్షించేందుకుగాను అన్ని రకాలైన ఫీచర్స్‌ని వారియొక్క ప్రోడక్ట్స్‌లో ఇమిడింప జేస్తున్నారు. ప్రస్తుతం 3జి హ్యాండ్ సెట్స్ మొబైల్స్‌లలో వీడియో కాలింగ్ అనేది సర్వ సాధారణమై పోయింది. కేవలం 3జి హ్యాండ్ సెట్స్‌లోనే వీడియో కాలింగ్ అనే పద్దతికి ఇంటెక్స్ మొబైల్ స్వస్తి చెప్పింది. దీని అర్దం ఏమిటంటే ఇంటెక్స్ కంపెనీ కొత్తగా IN 4470 N అనే మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ 2జి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇందులో వీడియో కాలింగ్ ఫెసిలిటీని కూడా కల్పించడం విశేషం. ఈ హ్యాండ్ సెట్ కోసం ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్తగా ఓ ఎడ్వర్టైజ్‌మెంట్‌‌ని రూపోందించడం జరిగింది. ఈ ప్రకటనలో ఇంటెక్స్ ఈ మొబైల్‌పై వినూత్నంగా ప్రచారం చేస్తుంది. దీనికి పెట్టిన పేరు ఏంటంటే 'Ab jo bolna hai muh pe bol'. గతంలో ఇలాంటి మొబైల్‌కే Ab bat karo face to face అనే టైటిల్‌ని నిర్ణయించింది. ఈ మొబైల్‌కి ఇంటెక్స్ ప్రపంచం మొత్తం ఇందులో ఉన్న కొత్త ఫీచర్ వీడియో కాలింగ్ పై బాగా ప్రకటనలు ఇచ్చుకుంటుంది.

కొత్తగా ఇంటెక్స్ దీని కోసం మూడు ప్రత్యేకమైన యాడ్స్‌ని రూపోందించండం జరిగింది. ఈ ముడింట్లో 2జి మొబైల్స్‌కి వీడియో కాలింగ్ ఫెసిలిటీని ఎలా వాడాలో చాలా చక్కగా చూపించడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని మొబైల్ కంపెనీలు కూడా 3జి మొబైల్స్, 3జి నెట్ వర్క్స్ మీదనే దృష్టిని నిలపడంతో తెలివిగా మేము 2జి సర్వీసెస్‌ని కస్టమర్స్‌కి ఎలా వాడాలో అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయడం జరిగిందన్నారు. ఇంటెక్స్ కంపెనీ మొట్టమొదటి సారి యూత్‌ని దృష్టిలో పెట్టుకోని విడుదల చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్. ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలైతే 3జి సర్వీస్‌లను కూడా కస్టమర్స్ ఒక్క క్షణం ఆపి ఈ మొబైల్‌పై తమ దృష్టిని కేంద్రీకరించడం జరగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Intex IN4470 N features:

Dual Sim
Face 2 Face chat
Answering machine
Mobile tracker
Expandable memory up to 8GB
Audio and video player
Bluetooth and GPRS facility
2000mAh battery

ఇక ఇంటెక్స్ IN4470 N త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. ఖచ్చితంగా దీని కోసం రూపోందించిన యాడ్స్ మేజర్ రోల్‌ని పోషించనున్నాయి. ఈ హ్యాండ్ సెట్ ద్వారా కంపెనీ ప్రపంచంలో ఉన్న బెస్ట్ అప్లికేషన్స్ అన్ని ఒకేసారి కస్టమర్స్‌కి అందించనున్నామని ధీమా వ్యక్తం చేసింది. ఇక దీని ఖరీదుని మాత్రం ప్రస్తుతానికి వెల్లిడించలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X