మార్కెట్ విస్తరణ దిశగా ఇంటెక్స్

Posted By: Staff

మార్కెట్ విస్తరణ దిశగా ఇంటెక్స్

ప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ నిర్మాణ సంస్థ ఇంటెక్స్ (Intex) త్వరలో ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. వీటి ధరలు రూ.5000 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయి. ద్వితీయ ఇంకా తృతియ శ్రేణి పట్టణాల మొబైల్

మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని వీటిని లాంచ్ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇవేకాకుండా ఐదు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ నిమగ్నమై ఉంది.

మార్కెట్‌ను మరింత విస్తరించుకునే క్రమంలో ఇంటెక్స్ గత వారం ఆక్వా 4.0 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ధర 5,490. మొబైల్ ఫోన్‌ల అమ్మకాల రూ.400కోట్ల మైలు రాయిని అధిగమించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆదాయంలో 20 శాతం స్మార్ట్‌ఫోన్‌ల నుంచి రాబట్టాలని సంస్థ నిర్ణయించుకుంది. ప్రస్తుత మార్కెట్లో సంస్థకు దేశవ్యాప్తంగా 100 సూపర్ డిస్ట్ర్రిబ్యూషన్ పాయింట్‌లు, 500 సాధారణ డిస్ట్ర్రిబ్యూషన్ పాయింట్‌లు, 13,000 రిటైలింగ్ పార్ట్‌నర్‌లు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని సంస్థ భావిస్తోంది.

ఇంటెక్స్ ఆక్వా 4.0 ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,

800 మెగాహెర్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,

3.5 అంగుళాల డిస్‌ప్లే,

3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

జీ సెన్సార్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్,

ఎఫ్ఎమ్ విత్ రికార్డింగ్,

బ్లూటూత్,

మైక్రోఎస్డీ కార్డ్ సౌజన్యంతో మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

ధర రూ.5,490.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot