గుగూల్ క్రోమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో!!

Posted By:

 గుగూల్ క్రోమ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో!!

 

నెట్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అత్యంత వేగంగా పనిచేయడం మాత్రమే కాకుండా అనేక ఆధునిక ఫీచర్లను ప్రవేశపెట్టిన ఘనత ఈ బ్రౌజర్‌కు దక్కుతుంది. తాజాగా గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్‌కూ విస్తరించింది. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఫోన్లతో మాత్రమే పనిచేస్తుంది.

ఈ ఒక్కలోపాన్ని మినహాయిస్తే ఆండ్రాయిడ్ క్రోమ్ బ్రౌజర్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర ఫోన్లతో సింక్రనైజేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక ట్యాబ్ నుంచి మరో ట్యాబ్‌కు మారిపోవడం కూడా సులువు. స్క్రీన్‌పై లింకులు ఎక్కువై అవసరమైనవాటిని క్లిక్ చేయడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు చిన్న భూతద్దాన్ని ఏర్పాటు చేయడం దీంట్లో ఉన్న మరో ప్రత్యేకత. అంతకంటే అద్భుతమైన మరో ఫీచర్.. మొబైల్‌ఫోన్‌లో మీరు ఉపయోగిస్తున్న ట్యాబ్స్ మొత్తాన్ని కంప్యూటర్ తెరపై చూసుకోగలగడం. ఓత్సాహికులు ఈ అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ మార్కెట్ లోకి ప్రవేశించి డౌన్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot