ఐవోఎస్ 5.1 బీటాలో 'ఆపిల్ టివి'కి కోడ్

Posted By: Staff

ఐవోఎస్ 5.1 బీటాలో 'ఆపిల్ టివి'కి కోడ్

 

రాబోయే కాలంలో విడుదలకు సిద్దంగా ఉన్న యాపిల్ టివి రియాలిటీకి దగ్గరగా ఉండబోతుందని సమాచారం. ఇది మాత్రమే కాదండోయ్ ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఈ ఉత్పత్తికి కొడ్ నేమ్స్‌ని కూడా పెట్టనున్నారని సమాచారం. ఆపిల్ లేటేస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఐవోఎస్ 5.1 డెవలపర్ బీటా వర్సన్'లో దీనికి సంబంధించిన కొన్ని కోడ్ నేమ్స్ బయటకు రావడం జరిగింది.

ప్రస్తుతం బీటా వర్సన్‌కి మరిన్ని మార్పులు, చేర్పులు చేసి ఒరిజినల్ వర్సన్‌ని త్వరలో విడుదల చేయనున్నారు. ఐతే ఆపిల్ టివి కొడ్ నేమ్స్‌ని ఫైనల్‌గా యూజర్స్ భావించకూడదు. విడుదలకు ముందు ఈ కోడ్ నేమ్స్ అన్నింటిని తీసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదని స్పష్టం చేశారు. ఆపిల్ విడుదల చేయనున్న 'డ్యూయల్ మోడ్ ఐప్యాడ్ 2'లో కోడ్ నేమ్‌గా 'జె33'ని ప్రకటించడం జరిగింది.

 

స్టీవ్ జాబ్స్ ఆత్మకధలో రాసినట్లు 'ఇంటిగ్రేటెడ్ టెలివిజన్ సెట్'ని ప్రతి ఒక్క ఆపిల్ ఉత్పత్తిలో నిక్షిప్తం చేసేందుకు స్టీవ్ జాబ్స్ 'క్లౌడ్ సర్వీసెస్' కాన్పెస్ట్‌ని పేర్కోనడం జరిగిందని తెలిపాడు. ఆపిల్ టివి యూజర్స్ కొసం క్లౌడ్ సర్వీసెస్‌ని ఉపయోగించి ఐట్యూన్స్‌ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot