ఐవోఎస్ 5తో యాపిల్ రాత మారేనా..!!

Posted By: Super

ఐవోఎస్ 5తో యాపిల్ రాత మారేనా..!!

ప్రపంచంలో నాణ్యమైన ఉత్పత్తులను విడుదల చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న కంపెనీ యాపిల్. యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా, ఇంతా కాదు. యాపిల్ కొత్తగా ఓ పాపులర్ టెక్నాలజీని విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి అందిరికి తెలిసిందే. యాపిల్ విడుదల చేయాలనుకుంటున్న ఆ కొత్త టెక్నాలజీ 'ఐవోఎస్ 5.0' యాపిల్ ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ టెక్నాలజీని విడుదల చేసినట్లేతై ఐపోన్, ఐప్యాడ్, ఐపాడ్‌లకు మరింత గిరాకీ లభిస్తుందని అన్నారు.

ఐవోఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెట్టింగ్ అప్లికేషన్స్‌లో నూతన విధానాన్నిఅనుసరించినట్లు తెలిపారు. గతంలో యాపిల్ విడుదల చేసిన వర్సన్‌తో పోల్చితే ఇందులో దీర్ఘచతురస్రాకార స్విచ్‌లను వాడడం జరిగిందన్నారు. ఇక ఇందులో అద్బుతంగా రూపొందించిన నోటిఫికేషన్ సెంటర్ ఐవోఎస్ 5.0పైకే ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ నోటిఫికేషన్ సెంటర్‌లో అన్ని రకాల నోటిఫికేషన్స్ కూడా ఒకే చోట డిస్ ప్లే చేయడం జరుగుతుంది.

ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన లాక్ స్క్రీన్ అప్లికేషన్ అలర్ట్స్, నావిగేషన్ ఆఫ్షన్స్ ఏయే అఫ్లికేషన్స్‌కి ఏయఏ విధంగా ఉపయోగించాలో కూడా క్షణ్ణంగా వివరించడం జరిగింది. మేసేజింగ్ అప్లికేషన్ కూడా కొత్త రూపుని సంతరించుకుంది. దీంతో యాపిల్ ఐడి యూజర్, పాస్ వర్డ్‌తో రిజస్టర్ అవ్వాల్సి ఉంటుంది. లోకేషన్ సర్వీసెస్‌ని కూడా యూజర్స్‌ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.

యాపిల్ ఐవోఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్ కొత్తగా ఐక్లౌడ్ సర్వీసెస్‌తో పాటు, 5జిబి మెమరీ స్టోరేజిని కలిగి ఉంది. యూజర్స్‌కు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే ఐవోఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఐట్యూన్స్ వై-పై సింక్ ఫీచర్ ద్వారా మల్టీమీడియో డేటాని సింక్ చేసి కంప్యూటర్, ఐవోఎస్ డివైజ్‌లో ఒకేసారి వైర్ లెస్ ఆధారంగా ప్లే చేయవచ్చు. కెమెరా అప్లికేషన్స్ కూడా ఇందులో అధ్బుతంగా తయారు చేయడం జరిగింది. గతంలో యాపిల్ విడుదల చేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పొల్చుకుంటే ఈ ఐవోఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో బాగా సక్సెస్‌ని సాధిస్తుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot