ఐప్యాడ్‌తో కొత్త ప్రయోగం.. గుడ్డి వారికి చూపు

Posted By: Super

ఐప్యాడ్‌తో కొత్త ప్రయోగం.. గుడ్డి వారికి చూపు

లండన్: సాధారణంగా కళ్లు లేని వాళ్లు బయట ప్రపంచాన్ని చూడలేరన్న వాస్తవం అందరికి తెలిసిందే. కానీ వారి కొసం ప్రత్యేకంగా యాపిల్ కంపెనీ ఐప్యాడ్‌ని రూపొందించడం జరుగుతుంది. ఈ ఐప్యాడ్ ద్వారా ఎదుటివారితో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఈ విషయాన్ని కాన్సాస్ యూనివర్సిటీ టీమ్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా ఈ టీమ్ కళ్లు కొల్పోయిన వారి పిల్లలను కొంత మందిని తీసుకొని వారికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ టాబ్లెట్స్‌ని అందజేయడం జరిగింది.

సాధారణంగా మెదడుకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు వారు మానసికంగా గుడ్డివారిగా మారిపోవడం, కళ్లు కనిపించక పోవడం లాంటివి జరుగుతాయంట. ఎవరైతే పిల్లలు ఎదురుగా ఉన్న వస్తువులను చూడలేకపోతారో లేదా ఎదుటి వారి తగ్గట్టుగా ప్రవర్తించలేక పోతారో అటువంటి వారిలో మార్పులు తీసుకొచ్చేందుకు ఈ ఐప్యాడ్ పనికి వస్తుందని కాన్సాస్ యూనివర్సిటీలో రీసెర్ట్ చేస్తున్న మురిల్ సాండర్స్ తెలియజేశారు.

సాండర్స్ ఎవరైతే ఈ జన్యులోపంతో భాదింపబడుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఎంతో కాలం నుండి కృషి చేస్తున్నారు. ఎవరైతే పిల్లలు సివిఐ(cortical visual impairment)తో భాదపడుతున్నారో అటువంటి వారు ఎక్కవ కాంతితో ఉన్న లైట్స్, వస్తువులను చూడగలుగుతారని అన్నారు. ప్రత్యేకించి తయారు చేసిన ఈ ఐప్యాడ్‌లో కాంతివంతమైన స్క్రీన్, కలర్, సౌండ్ వారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని తెలియజేశారు.

ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనిని టచ్ స్క్రీన్‌తో రూపొందించడం జరిగింది. ఇందులో ఒక బేబి ఫింగర్ లాంటిది ఉంటుంది. దానిని టచ్ చేయగానే తెల్లని బ్యాక్ గ్రౌండ్ మీద సౌండ్స్ చేసుకుంటూ ఇమేజిలు కలర్ షేప్స్‌తో దర్శనమిస్తాయి. ఇలాంటి వాటిని అనుభూతితో ఫీల్ అవుతారని అన్నారు. ఈ ఐప్యాడ్‌ని ఉపయోగించడం వల్ల కేవలం స్క్రీన్‌తోనే పిల్లలు మమేకం అవకుండా, స్క్రీన్‌పై వచ్చేటటువంటి మిగిలిన విషయాలన్నింటిని కూడా వాళ్ల కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకొవాలో వారికి తెలియజేయవచ్చని అన్నారు. సాండర్స్ ప్రస్తుతం ఈ టెస్టులన్నింటినీ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఉన్న జూనియర్ బ్లైండ్ పీపుల్ సహాకారంతో చేస్తున్నాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot