Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌.. ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ విడుదల నేపథ్యంలో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 14 ప్లస్‌ (iPhone 14 Plus Smartphone Price Drop) మోడల్‌ ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపును పొందవచ్చు.

ఆపిల్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌ ప్రారంభ ధర రూ.79,600 గా ఉంది. అదే ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.56499 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు UPI ద్వారా చెల్లింపులు చేస్తే మరో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ ధర రూ.55,499 గా ఉంది.

iPhone 14 Plus model gets huge discount on Flipkart

ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సన్నని బెజెల్స్‌తో కూడిన 1284*2778 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. HDR, డాల్బీ విజన్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ రక్షణ కోసం సిరామిక్‌ షీల్డ్‌ గ్లాస్‌ను కలిగి ఉంటుంది.

ఐఫోన్‌ 14 ప్లస్‌ మోడల్‌ 5nm A15 బయోనిక్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. 5 కోర్‌ GPU, 16 కోర్‌ NPU తో జతచేయబడుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ ఐఫోన్‌ మోడల్‌ వెనుకవైపు 12MP డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టు, అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఐఫోన్‌ 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌లను కలిగి ఉంది.

ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 4352mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌ IP68 డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్‌ ఐడీను కలిగి ఉంటుంది. WiFi 802, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 14 Plus model gets huge discount on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X