Home
Mobile

ఐఫోన్‌ 14 ప్లస్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ పూర్తి వివరాలు..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ 2022 సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను (iPhone 14 Plus) లాంచ్‌ చేసింది. విడుదల సమయంలో ఐఫోన్‌ 14 ప్లస్‌ మోడల్‌ హ్యండ్‌సెట్‌ 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉండేది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు, ఇతర ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. మరో వారం రోజుల్లో ఐఫోన్ 16 సిరీస్‌ విడుదల కానుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.58,999 గా ఉంది. 256GB వేరియంట్‌ ధర రూ.69,999 గా ఉంది. 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో గరిష్ఠంగా రూ.1,500 తగ్గింపును పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా UPI లావాదేవీల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

iPhone 14 plus Smartphone

ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ బ్లూ కలర్‌లోనే లభిస్తుంది. 512GB స్టోరేజీ వేరియంట్‌ రెడ్‌, మిడ్‌నైట్‌, పర్పుల్‌, యెల్లో రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.53,350 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 ప్లస్‌ మోడల్‌ 1284*2778 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సిరామిక్‌ షీల్డ్‌ గ్లాస్‌ రక్షణను పొందుతుంది. 5nm A15 బయోనిక్‌ చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. హెక్సా కోర్ CPU మరియు ఆపిల్‌ GPU కోర్‌ గ్రాఫిక్స్‌ తో జతచేయబడుతుంది.

ఐఫోన్‌ 14 ప్లస్‌ మోడల్‌ వెనుకవైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 12MP కెమెరా మరియు 12MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్‌ LED ఫ్లాష్‌ లైట్లతో అందుబాటులో ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా గరిష్ఠంగా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 4352mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. IP68 డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. Wi-fi 802, బ్లూటూత్ 5.3, ఫేస్‌ ఐడీ సహా యాక్సిలిరో మీటర్‌, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్‌, బారోమీటర్‌ సెన్సార్లను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
iPhone 14 plus Smartphone gets discount on flipkart here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X