ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. స్పెసిఫికేషన్‌లు, ధర, ఫ్లిప్‌కార్ట్ సేల్ పూర్తి వివరాలు..
ఐఫోన్ 14 సిరీస్ భారత్‌లో 2022 లో విడుదల అయింది. విడుదల సమయంలో ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.89,990 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో (iphone 14 Plus Smartphone price Drop) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఆపిల్ A15 బయోనిక్ ప్రాసెసర్ పైన పనిచేస్తోంది.
ఐఫోన్ 14 ప్లస్ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.55,999 గా ఉంది. అదే 256GB వేరియంట్ ధర రూ.65,999, 512GB వేరియంట్ ధర రూ.85,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లూ, ప్రొడక్ట్ రెడ్, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, యెల్లో రంగుల్లో లభిస్తుంది. అయితే ప్రతి వేరియంట్ అన్ని రంగుల్లో లభించదు.

ఫ్లిప్‌కార్ట్ పేజీ ఆధారంగా HDFC క్రెడిట్, డెబిట్ కార్డు EMI లావాదేవీలపై రూ.4000, అదేవిధంగా BOB కార్డు కార్డుల EMI లావాదేవీలపై రూ.4000, BOB కార్డులు (Non EMI) లావాదేవీలపై రూ.3000 తగ్గింపును పొందవచ్చు. HDFC నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్ UPI పై రూ.750 తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 ప్లస్ 1284*2778 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. A15 బయోనిక్ చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. హెక్సాకోర్ CPU మరియు ఆపిల్ GPU కోర్ గ్రాఫిక్స్ తో జతచేయబడుతుంది.
ఐఫోన్ 14 ప్లస్ మోడల్ వెనుకవైపు డ్యూయల్ 12MP కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 12MP మరియు 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్‌తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 4352mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చింది. సింగిల్ ఛార్జింగ్‌తో 26 గంటల వరకు బ్యాటరీ టైం వస్తుందని ఆపిల్ చెబుతోంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా వైఫై 802, బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది. మరియు ఫేస్ ఐడీ, యాక్సెలిరో మీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్, బారోమీటర్ సెన్సార్లను కలిగి ఉంది. USB 2,0 పోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








