iPhone 14 vs iPhone 13: భార‌త యూజ‌ర్ల‌కు రెండింటిలో ఏది బెస్ట్!

|

యాపిల్ కంపెనీ నుంచి iPhone 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల విడుద‌లకు ఎన్నాళ్లుగానో వేచి చూసిన స‌మ‌యం ఎట్ట‌కేల‌కు వ‌చ్చేసింది. యాపిల్ కంపెనీ బుధ‌వారం నిర్వ‌హించిన ఫార్ అవుట్ ఈవెంట్‌లో, నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేసింది. గత సంవత్సరం ప్రారంభించిన iPhone 13 సిరీస్‌తో పోలిస్తే ఈ కొత్త ఐఫోన్ సిరీస్ మోడ‌ల్స్ ప‌లు మెరుగైన అప్‌గ్రేడ్‌లతో విడుద‌లైనట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఈ సంవత్సరం iPhone 14 మినీ లేదు దానికి బదులుగా, ఆపిల్ 6.7-అంగుళాల స్క్రీన్‌తో iPhone 14 ప్లస్‌ను ప్రారంభించింది.

 
iPhone 14 vs iPhone 13: భార‌త యూజ‌ర్ల‌కు రెండింటిలో ఏది బెస్ట్!

iPhone14 నాన్-ప్రో ఐఫోన్ మోడ‌ల్స్‌ వాటి అవుట్‌గోయింగ్ మోడ‌ల్స్‌ కంటే కొన్ని చిన్నపాటి అప్‌గ్రేడ్‌లను మాత్ర‌మే పొందాయి. అయితే, iPhone14 ప్లస్ అనేది ఈ సంవత్సరం కంపెనీ లాంచ్ చేసిన సరికొత్త మోడల్. ఇది iPhone 14 కంటే పెద్ద డిస్‌ప్లే 6.7-అంగుళాల స్క్రీన్ మరియు పెద్ద బ్యాటరీని క‌లిగి ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ... మీరు ప్ర‌స్తుతం ఐఫోన్ కొనుగోలు చేయ‌డానికి వేచి ఉంటే, iPhone13, iPhone14 రెండు మోడ‌ల్స్‌లో ఏది స‌రైన ఎంపిక అనేది తెలియ‌జేసేందుకు మేం కొన్ని పోలిక‌ల్ని మీ ముందుకు తెచ్చాం. వివ‌రంగా తెలుసుకోవ‌డానికి ఆర్టిక‌ల్ మొత్తం చ‌ద‌వండి.

iPhone 14 vs iPhone 13: డిస్‌ప్లే

iPhone 14 vs iPhone 13: డిస్‌ప్లే

డిస్‌ప్లే విష‌యంలో రెండు మోడ‌ల్స్‌లో పెద్ద‌గా మార్పులు లేవు. రెండు ఫోన్‌లు 2532×1170-పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల OLED సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కొనసాగిస్తున్నాయి. స్క్రీన్ ట్రూ టోన్, హెచ్‌డిఆర్‌తో పాటు పి3 వైడ్ కలర్ గామట్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఫేస్ ఐడి సెన్సార్‌లు మరియు ఫ్రంట్ కెమెరా కోసం ఐఫోన్ 12 కంటే 20 శాతం చిన్నదిగా ఉండే విస్తృత నాచ్ ఉంది.

iPhone 14 vs iPhone 13: ప‌ర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్‌వేర్‌

iPhone 14 vs iPhone 13: ప‌ర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్‌వేర్‌

ఐఫోన్ 14 మోడ‌ల్ A15 బయోనిక్ చిప్ నుండి శక్తిని పొందుతుంది. ఐఫోన్‌13 ప్రో మోడల్‌లలో కూడా ఇదే త‌ర‌హా చిప్‌సెట్‌ను అందించారు. ఇది యూజ‌ర్ల‌కు మెరుగైన ప‌ర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఐఫోన్ 14 మొబైల్స్‌లో iOS 16 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. తద్వారా యూజ‌ర్లు పలు కొత్త ఫీచ‌ర్ల‌ను ఎక్స్‌పీరియ‌న్స్ చేయ‌వ‌చ్చు. ఐఫోన్ 13 మోడ‌ల్ iOS 15 తో వ‌చ్చింది.

యాపిల్ సాధారణంగా ర్యామ్ వివరాలను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌దు. కానీ, నాలుగు ఐఫోన్ 14 మోడల్స్ 6GB ర్యామ్‌ను అందిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. iPhone 13 మోడ‌ల్ 4GB RAMని ప్యాక్ చేస్తుంది కాబట్టి ఇది నాన్-ప్రో మోడల్‌లకు అప్‌గ్రేడ్ గా భావించ‌వ‌చ్చు.

iPhone 14 vs iPhone 13: భార‌త మార్కెట్లో ధ‌ర‌లు!
 

iPhone 14 vs iPhone 13: భార‌త మార్కెట్లో ధ‌ర‌లు!

ఐఫోన్ 14 బేస్ మోడల్ 128GB భార‌త్‌లో రూ.79,900 ప్రారంభ ధ‌ర‌తో వస్తుంది. 256GB మరియు 5612GB స్టోరేజ్ ఎంపికలు వరుసగా రూ.89,900 మరియు రూ.1,09,900 కంపెనీ నిర్ణ‌యించింది. ఇది మిడ్‌నైట్‌, బ్లూ, స్టార్‌లైట్, ప‌ర్పుల్‌ మరియు రెడ్ ఐదు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

iPhone 14 లాంచ్ తర్వాత, iPhone 13 బేస్ వేరియంట్ 128GB ప్రారంభ ధర రూ.69,900 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ భారతదేశంలో రూ.79,900కి విడుదలైంది. 256GB వేరియంట్ ఇప్పుడు రూ.79,900కి, 512GB వేరియంట్ రూ.99,900కి అందుబాటులో ఉంది. కూడా ఉంది. ఇది స్టార్‌లైట్, మిడ్‌నైట్, బ్లూ, గ్రీన్, పింక్ మరియు ప్రొడక్ట్ రెడ్ కలర్ల ఆప్ష‌న్ల‌లో లభిస్తుంది.

iPhone 14 vs iPhone 13: డిజైన్‌

iPhone 14 vs iPhone 13: డిజైన్‌

ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 13 ఒకే మాదిరి డిజైన్ క‌లిగి ఉన్నాయి. రెండు మోడ‌ల్స్‌లో కూడా క‌ర్వ్‌డ్ కార్న‌ర్స‌తో ఫ్లాట్ ఫ్రేమ్ ఉంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‌ప్లే పైభాగంలో విస్తృత నాచ్‌ను కూడా కలిగి ఉంటాయి. వెనుక భాగంలో, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన‌ డ్యూయల్ కెమెరా సెటప్ మాడ్యూల్‌ ఉంది. వాల్యూమ్ బ‌ట‌న్‌లు ఫోన్‌కు ఎడమ వైపున, పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి.

ఐఫోన్ 14 బరువు 172 గ్రాములు కాగా, ఐఫోన్ 13 బరువు 173 గ్రాములు. రెండు iPhone మోడల్‌లు వాట‌ర్ మ‌రియు డ‌స్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 సర్టిఫికేషన్‌తో వస్తాయి. ఈ ఐఫోన్‌లు నీటిలో 6 మీటర్లలో 30 నిమిషాల వ‌ర‌కు త‌ట్టుకోగ‌ల‌వు.

iPhone 14 vs iPhone 13: కెమెరా

iPhone 14 vs iPhone 13: కెమెరా

రెండు ఐఫోన్ మోడ‌ల్స్ కూడా బ్యాక్ సైడ్ 12MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తాయి. కొత్త మోడల్‌లు మెరుగైన విస్తృత ఎపర్చరుతో పెద్ద కెమెరా సెన్సార్‌ను పొందుతాయి. f/1.5 ఎపర్చరుతో 12MP ప్రధాన కెమెరా మరియు 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం, iPhoneలు f/1.9 ఎపర్చర్‌తో నాచ్ లోపల 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి.

కొత్త మోడ‌ల్ ట్రూ డెప్త్ ఆటో ఫోక‌స్ స‌పోర్ట్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. ప్రయాణంలో మెరుగైన వీడియో రికార్డింగ్ అనుభవం కోసం కొత్త యాక్షన్ మోడ్ క‌లిగి ఉంది. వినియోగదారులు ప్రధాన కెమెరాను ఉపయోగించి చిత్రీకరించిన ఫోటోలలో 2.5x మెరుగుదలను పొంద‌వ‌చ్చు. అల్ట్రావైడ్ మరియు ఫ్రంట్ కెమెరాలో ఫోటోలలో 2x మెరుగుదలను పొందుతారు.

iPhone 14 vs iPhone 13: బ్యాట‌రీ

iPhone 14 vs iPhone 13: బ్యాట‌రీ

Apple సాధారణంగా దాని iPhone మోడల్‌ల బ్యాటరీ సామర్థ్యాన్ని బహిర్గతం చేయదు. ఐఫోన్ 14 మోడల్ ఒకసారి ఛార్జ్ చేయ‌డం ద్వారా గరిష్టంగా 20 గంటల బ్యాటరీ లైఫ్(వీడియోల వీక్షించేందుకు) అందిస్తుందని పేర్కొంది. రూమ‌ర్లు తెలిపిన ప్ర‌కారం.. ఐఫోన్ 14 మోడ‌ల్ 3279 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్, 15W MagSafe ఛార్జింగ్ మరియు 7.5W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. ఐఫోన్ 13 విష‌యానికొస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 19 గంటల బ్యాటరీ జీవితాన్ని అందజేస్తుందని పేర్కొంది. ఇది 3227 mAh బ్యాటరీని క‌లిగి ఉంది.

ఐఫోన్ 14 లో అనేక అప్‌గ్రేడ్‌లు:

ఐఫోన్ 14 లో అనేక అప్‌గ్రేడ్‌లు:

కెమెరా ఫీచ‌ర్ల ప‌రంగా, బ్యాట‌రీ అప్‌గ్రేడ్ ప‌రంగా, ప‌ర్ఫార్మెన్స్ ప‌రంగా iPhone14 అనేక మెరుగుద‌ల‌ల‌తో వ‌చ్చింది. సాఫ్ట్‌వేర్ ప‌రంగా చూస్తే దీనికి అప్‌డేట్ వ‌ర్ష‌న్ ఐఓఎస్ 16 వ‌ర్ష‌న్ ఓఎస్ అందిస్తున్నారు. ఈ అంశాల ప‌రంగా ఐఫోన్ 14 బెస్ట్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. కానీ, ధ‌రల ప‌రంగా చూస్తే ఐఫోన్ 13 ఫీచ‌ర్ల ప‌రంగా కొన్ని మైన‌ర్ డిఫ‌రెన్సెస్ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ.. కాస్త త‌క్కువ ధ‌ర‌కే రూ.69,900 అందుబాటులో ఉంది. పండుగల సంద‌ర్భంగా ఆన్‌లైన్ సేల్ సమయంలో, ఐఫోన్ 13 మోడల్‌ల ధర మరింత త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. ధ‌ర ప‌రంగా చూస్తే ఐఫోన్ 13 స‌ర‌స‌మైన‌దిగా చెప్ప‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
iPhone 14 vs iPhone 13: Which is a Better Buy for Users in India?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X