ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లపై డిస్కౌంట్‌లు.. ఫ్లిప్‌కార్ట్ లిమిటెడ్ సేల్ పూర్తి వివరాలు..!!
ఆపిల్ ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 14ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌తోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. గత సంవత్సరం ఈ ఐఫోన్ 15 (iPhone 15 Price Drop) లాంచ్ అయింది. విడుదల సమయంలో 128GB వేరియంట్ ధర రూ.79,900 గా ఉంది. ప్రస్తుతం 14 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర రూ.67,999 గా ఉంది. దీంతోబాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 అదనపు తగ్గింపును పొందుతారు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం అయితే లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ధరకు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది.

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. సిరామిక్ గాజు రక్షణ పొందుతుంది. మరియు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌పైన పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ ఐదు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. పింక్, గ్రీన్, బ్లూ, బ్లాక్, యెల్లో రంగుల్లో లభిస్తుంది. 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాలను కలిగి ఉంది. వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3349mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్ లెస్ ఛార్జింగ్‌తో సపోర్టు చేస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 128GB వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.79,900 గా ఉంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.17,901 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.61,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 14 ప్లస్ హ్యాండ్ సెట్ 1284*2778 పిక్సల్ రిజల్యూషన్ తో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. iOS 16, ఆపిల్ A15 బయోనిక్ ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ 4323mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications