ఐఫోన్ 16 సిరీస్ విడుదల వేళ.. ఐఫోన్ 15, ఐఫోన్ 14 మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు.. పూర్తి వివరాలు..!
ఆపిల్ సంస్థ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు (iPhone 16 Series Launch) ఇవాళ లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ (Apple its Glowtime Event) జరగనుంది. ఆపిల్ ప్రధాన కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు విడుదల కానున్నాయి. ఆపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్, ఆపిల్ టీవీ యాప్ ద్వారా లైవ్ చూడవచ్చు.
ఐఫోన్ల ధరలపై డిస్కౌంట్‌లు :
ఐఫోన్ 16 సిరీస్ విడుదల నేపథ్యంలో ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు తగ్గింపు ధరలకు (iPhone Price drop) అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర స్టోర్‌లలో తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్లను పొందవచ్చు.

ఐఫోన్ 15 ధర, ఆఫర్లు ;
ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ప్రారంభం ధర రూ.79,600 గా ఉంది. ప్రస్తుతం ధర రూ.69,999 గా ఉంది. బ్యాంకు, ఇతర కూపన్‌ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా రిలయన్స్ డిజిటల్ మరియు ఇతర స్టోర్‌లలో ఈ తరహా డిస్కౌంట్ ధరలను పొందవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 15 ప్లస్, ప్రో మోడళ్లను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్, సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌పైన పనిచేస్తోంది. 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.
ఐఫోన్ 15 కెమెరాల ద్వారా తక్కువ వెలుతురు లోనూ నాణ్యమైన ఫోటో లను క్యాప్చర్ చేయవచ్చు. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాలను కలిగి ఉంది. వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు తో 3349mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఐఫోన్ 14 ధర, ఆఫర్లు :
ఐఫోన్ 14 మోడల్‌ను కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో రూ.69,600 ధరగా ఉండేది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.57,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఇతర మోడళ్లు కూడా తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 14 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A15 బయోనిక్ SoC చిప్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP 120 డిగ్రీల అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 12MP ట్రూ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ 3279mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications