ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ 2024.. ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింపు.. పూర్తి వివరాలు..!!
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గత సంవత్సరం భారత్‌లో విడుదల అయ్యాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ 2024 లో భాగంగా ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus Smartphone Price Drop) 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లతోపాటు బ్యాంకు డిస్కౌంట్‌లతో ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 ప్లస్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999 గా ఉంది. 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.84,999, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.500, UPI ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లు :
ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1290*2796 పిక్సల్ రిజల్యూషన్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్, iOS 17 అవుట్ ఆఫ్ ది బాక్స్ OS పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్ సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు కలిగి ఉంటుంది. f/1.6 అపేచర్‌తో 48MP కెమెరా, f/2.4 అపేచర్‌తో 12MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/1.9 అపేచర్‌తో 12MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్ సెట్ ప్రస్తుతం 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు బ్లూ, బ్లాక్, గ్రీన్, యెల్లో మరియు పింక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ పరంగా ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ 5.3, వైఫై 802.11, GPS, NFC, USB-C 5G, 4G, 3G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంద. దీంతోపాటు గైరోస్కోప్ సెన్సార్, బారోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నిటోమీటర్ సెన్సార్ వంటి సెన్సార్‌లను కలిగి ఉండనుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







