iPhone 15 plus ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ పూర్తి వివరాలు..!
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను గత సంవత్సరం సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. మరో వారం రోజుల్లో ఐఫోన్ 16 సిరిస్ లాంచ్ కానుంది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ల ద్వారా ఈ హ్యాండ్‌సెట్ లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఐఫోన్ 15 ప్రో మోడళ్లు ఎటువంటి తగ్గింపును పొందలేదు.
ఐఫోన్ 15 ప్లస్ ధర :
ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌ను తగ్గింపు ధరకు (iPhone 15 Plus Smartphone) కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,600 గా ఉంది. అదే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.75,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 ప్లస్ మోడల్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మరియు సిరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణను కలిగి ఉంది.
A16 బయోనిక్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ ఐఫోన్ 15 ప్లస్ మోడల్ 4383mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది.
48MP + 12MP కెమెరాలు :
ఐఫోన్ 15 ప్లస్ మోడల్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. OIS సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ పిక్సల్ PDAF ఫీచర్, f/2.4 అపేచర్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ f/1.9 అపేచర్‌తో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఎమర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్ ఫీచర్లు :
ఈ ఐఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫేస్ ఐడీ, ఎమర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్ సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఫేస్ ఐడీ, ప్రాక్సిమిటీ సెన్సార్, డ్యూయల్ యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








