ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
టెక్ దిగ్గజం ఆపిల్ మరో నాలుగు రోజుల్లో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు విడుదల కానున్నాయి. కొత్త మోడళ్ల రాకతో పాత సిరీస్ ధరలు తగ్గుతున్నాయి. అంటే గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు తగ్గుతున్నాయి. వివిధ ప్లాట్‌ఫాంలో తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఇప్పటికే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లు డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌ను కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ (iPhone 15 Pro Max Smartphone Discoun 256GB వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.1,59,000 గా ఉంది. ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో ఈ మోడల్‌ను రూ.1,37,990 కే అందిస్తున్నారు. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.21,910 తగ్గింపును పొందినట్లంది.

దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5,000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు EMI ఆప్షన్‌లో కూడా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్‌లో బ్లాక్ టైటానియం కలర్ వేరియంట్ ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2796*1290 పిక్సల్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ A17 ప్రో చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైట్ కెమెరా, 12MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 20W వైర్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4441mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టీరియో స్పీకర్లు, IP68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications