అమెజాన్‌లో ఐఫోన్ 15 పై ఆకట్టుకొనే ఆఫర్.. ఈ బ్యాంకు కార్డుల ద్వారా రూ.6000 తగ్గింపు..!!
ఆపిల్ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 15 (iphone 15 Price) శక్తివంతమైనది. గత మోడల్ కంటే మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ 15ను అత్యంత తక్కువ ధఱకు కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ సాధారణ ధర రూ.79,900 గా ఉండగా... అమెజాన్‌లో ధర రూ.72,690 గా ఉంది. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డులు, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.66,900 గా ఉంది.

రూ.27,550 ఎక్స్చేంజీ ప్రయోజనాలు : దీంతోపాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజీ ఆఫర్‌ను కూడా ప్రకటన చేసింది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.27,550 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో అమెజాన్ వెల్లడించలేదు.
ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ గాజుతో రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌తో వచ్చింది. iOS 17 పైన పనిచేస్తుంది. మరియు iOS 18 అప్‌డేట్‌ను పొందవచ్చు.
ఈ ఐఫోన్ 15 క్వాడ్ పిక్సల్ సెన్సార్ మరియు 100 శాతం లైటినింగ్ ఫాస్ట్ ఆటోఫోకస్‌తో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ ఐఫోన్ 15 బేస్ మోడల్ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 3349mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 15W వైర్ లెస్ ఛార్జింగ్‌తో సపోర్టు చేస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.
ఇప్పటికే ఆపిల్... ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్ 15లో ఈ ఫీచర్ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.
అమెజాన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ కూడా తగ్గింపు ధరను పొందింది. ఈ ఫోన్ విడుదల సమయంలో ధర రూ.1,59,900 గా ఉండగా అమెజాన్‌లో రూ.1,48,900 గా ఉంది. దీంతోపాటు SBI కార్డుల ద్వారా రూ.3000 కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. మరియు రూ.27,550 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలు పొందవచ్చు.


Click it and Unblock the Notifications