Home
Mobile

Flipkart బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024.. తొలిసారిగా అత్యంత తక్కువ ధరకు iPhone 15ను కొనుగోలు చేయవచ్చు..!!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024 (Flipkart Big Saving Days Sale 2024) ప్రస్తుతం జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలపై తగ్గింపు ధరలను అందిస్తోంది. దీంతోపాటు SBI కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ కార్డు ద్వారా 5 శాతం తక్షణ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ సేల్‌ మే 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 ను (iPhone 15 Smartphone Discount) అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 128GB వేరియంట్‌ విడుదల సమయంలో ధర రూ.79,900 ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.63,999 కే కొనుగోలు చేయవచ్చు. తొలిసారిగా ఎటువంటి బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

Flipkart Big Saving Days Sale 2024

ఐఫోన్‌ 15 ధర రూ.60,800! :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ కార్డు ద్వారా రూ.3,199 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్‌ 15 ధర రూ.60,800 గా ఉంటుంది. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా గరిష్ఠంగా రూ.56,000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఐఫోన్‌ 15 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్‌ 15 హ్యాండ్‌సెట్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ సిరామిక్‌ గాజుతో రక్షణ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్‌ చిప్‌తో వచ్చింది. iOS 17 పైన పనిచేస్తుంది.

ఐఫోన్‌ 15 క్వాడ్‌ పిక్సల్‌ సెన్సార్‌ మరియు 100 శాతం లైటినింగ్‌ ఫాస్ట్‌ ఆటోఫోకస్‌తో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 3349mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 15W వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌తో సపోర్టు చేస్తుంది. 20W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు. IP68 రేటింగ్‌తో వచ్చింది. USB-C ఛార్జింగ్‌ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్లు బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఈ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్‌ ఉంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు 80 శాతానికి మించి ఛార్జింగ్‌ కాకుండా నిరోధించే వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు 80 శాతం వద్ద ఛార్జింగ్‌ నిలిచిపోతుంది. ఫలితంగా బ్యాటరీ జీవిత కాలం మెరుగుపడుతుంది.

ఇప్పటికే ఆపిల్‌... ఆప్టిమైజ్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అనే సెట్టింగ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీని 80 శాతం వరకే ఛార్జింగ్‌ అయ్యేలా చూస్తుంది. అయితే ఐఫోన్‌ 15లో ఈ ఫీచర్‌ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 15 సిరీస్‌లోని సెట్టింగ్‌ల కింద బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్‌, ఛార్జింగ్‌ ఆప్టిమైజేషన్‌ అనే మరో ఆప్షన్లు ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 15 smartphone gets first ever lowest price on Flipkart Big Saving Days Sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X