ఐఫోన్ 16 సిరీస్ కలర్ వేరియంట్‌లు సహా కీలక వివరాలు లీక్.. గత మోడల్ కంటే భారీగా అప్‌గ్రేడ్..!!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఈ సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ (iPhone 16 Series) స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు లాంచ్ కానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి అనేక లీక్‌లు వచ్చాయి. తాజాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడళ్ల కలర్‌ల వివరాలు లీక్ అయ్యాయి.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం X లో Sonny Dickson అనే యూజర్ ఐఫోన్ 16 సిరీస్ కలర్ వేరియంట్‌ల వివరాలను వెల్లడించారు. దీని ఆధారంగా ఐఫోన్ 16 మోడల్ (iPhone 16 pro Smartphone) 5 రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వైట్, బ్లూ, బ్లాక్, పింక్, గ్రీన్ రంగుల్లో లభించే అవకాశం ఉంది.

ఐఫోన్ 16 ప్రో మోడల్ మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డాక్కర్ బ్లాక్ టైటానియం, గ్రే, బ్లూ టైటానియం లేదా రోజ్ రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రో మోడల్ గ్లోసీ ఫినిష్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే విడుదల సమయంలో ఈ కలర్ వేరియంట్‌ల పేర్లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
దీంతోపాటు ఇప్పటికే ఈ సిరీస్ డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ గత మోడల్ కంటే పెద్ద, బ్రైట్‌నెస్ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో డిస్‌ప్లే 6.1 అంగుళాలు ఉండగా.. ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే మాత్రం 6.3 అంగుళాలుగా ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు A18 ప్రో చిప్‌సెట్ మరియు భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మోడల్ A17 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అయితే ఐఫోన్ 16 ప్రో మోడల్ మాత్రం శక్తివంతమైన A18 ప్రో చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ మోడల్ AI సూట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఐఫోన్ 15 సిరీస్ కంటే ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల కెమెరా విభాగం అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు 5X జూమ్ సామర్థ్యంతో 48MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఐఫోన్ 16 సిరీస్ ప్రో మోడళ్లు ప్రత్యేకంగా క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతో సులభంగా ఫొటో, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

బ్యాటరీ విషయానికి వస్తే ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ 3577mAh బ్యాటరీ, అదే ప్రో మ్యాక్స్ మోడల్ 4676mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 20W Magsafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







