Home
Mobile

iPhone 16 Series ఐఫోన్ 16 సిరీస్‌లో అనేక మార్పులు.. 7 రంగుల్లో ప్లస్‌ మోడల్‌ అందుబాటులోకి...?

ఆపిల్‌ నుంచి ఐఫోన్‌ 16 సిరీస్ (iPhone 16 Series) ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్లపై అనేక లీక్‌లు వచ్చాయి. తాజాగా ఈ ఐఫోన్‌ 16 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కలర్‌ వేరియంట్లు వివరాలపై నివేదిక వచ్చింది.

ఈ నివేదిక ఆధారంగా ఐఫోన్‌ 16 ప్లస్‌ (iPhone 16 Plus Smartphone) ఏడు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లూ, పింక్, యెల్లో, గ్రీన్‌, బ్లాక్‌, వైట్‌, పర్పల్ రంగుల్లోను విడుదల కానుందని తెలుస్తోంది. weibo ఆధారిత లీక్‌లు ఈ విషయాన్ని వెల్లడించాయి.

iPhone 16 plus colours variants leaked

అయితే ఐఫోన్ 16 ప్రో మోడళ్లు స్పేస్‌ బ్లాక్‌, రోజ్‌ టైటానియం రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటీవలే మరో లీక్‌ వెలుగులోకి వచ్చింది. ఐఫోన్‌ 16 సిరీస్‌ హ్యాండ్‌ సెట్‌లు గత మోడల్‌ కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ఆధారంగా ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ గరిష్ఠంగా 4676mAh బ్యాటరీ, అదే ఐఫోన్ 16 ప్రో 3,355mAh బ్యాటరీ, ఐఫోన్ 16 3,516mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ఐఫోన్ 16 ప్లస్‌ మాత్రం 4,006mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఈ ఐఫోన్‌ 16 సిరీస్‌ క్యాప్చర్‌ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు హ్యాప్టిక్‌ ఫీడ్‌ బ్యాక్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుందని సమాచారం. అయితే స్టాండర్డ్ మోడళ్లు మాత్రమే యాక్షన్‌ బటన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు అన్ని మోడళ్లు USB-C ఛార్జింగ్ పోర్టు, పంచ్‌ హోల్‌ డిజైన్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

చిప్‌ సెట్‌ పరంగాను గత మోడళ్లు కంటే ఐఫోన్‌ 16 సిరీస్ అప్‌ గ్రేడ్‌ ఫీచర్ల, స్పెసిఫికేషన్లతో లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. స్టాండర్డ్‌ మోడళ్లు అప్‌గ్రేడ్‌ చేసిన A17 చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడళ్లు అడ్వాన్స్‌డ్‌ A18 ప్రో చిప్‌ సెట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్‌ వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

గత మోడళ్లు కంటే ఈ కొత్త సిరీస్‌ హ్యాండ్‌సెట్లు పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 16 మోడల్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్లస్‌ మోడల్‌ 6.7 అంగుళాలు, ప్రో మోడల్‌ 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అదే ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు కొత్త హ్యాండ్‌ సెట్‌ iOS 18 వెర్షన్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ OS జనరేటివ్‌ AI సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 16 plus could be in launched seven colours variants details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X