Home
Mobile

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ ఐఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌!

iPhone 16 Plus : ఆపిల్‌ నుంచి ఈ నెలలో ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని లీక్స్‌ వస్తున్నాయి. అయితే ఆపిల్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం అమెజాన్‌ లో ఐఫోన్‌ 16 ప్లస్‌ మోడల్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లే సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్లస్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు.

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ :
భారత్‌ మార్కెట్లో విడుదల సమయంలో ఐఫోన్ 16 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89990 గా ఉండేది. దీంతోపాటు 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99900 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమెజాన్‌ లో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.71990 గా ఉంది.

iphone 16 plus

మొత్తంగా రూ.21 వేల డిస్కౌంట్‌ :
అంటే సుమారుగా రూ.18 వేల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.21 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌ లో పింక్, అల్ట్రా మెరైన్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

సూపర్ రెటీనా డిస్‌ప్లే :
ఐఫోన్ 16 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌, గ్లాస్ బ్యాక్‌ ప్యానల్‌ ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. డైనమిక్ ఐలాండ్‌ ఫీచర్‌ ఉంది.

A18 చిప్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఐఫోన్ A18 చిప్‌ తో పనిచేస్తోంది. ఇటీవలే iOS లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ను పొందింది. అనేక ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. బ్యాటరీ, ఛార్జింగ్‌ పరంగా 4674mAh బ్యాటరీతో పనిచేస్తోంది. USB-C ఛార్జింగ్‌ పోర్టును సపోర్టు చేస్తుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్టును కూడా కలిగి ఉంది.

48MP కెమెరా, 4k వీడియో రికార్డింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 48MP వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌ తోపాటు HDR, నైట్‌ ఫోటోగ్రఫీ, పొర్ట్రెయిట్‌ మోడ్‌ ను సపోర్టు చేస్తుంది.

యాక్షన్‌, కెమెరా కంట్రోల్‌ బటన్లు :
దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యాక్షన్‌, కెమెరా కంట్రోల్‌ బటన్‌ లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.3, వైఫై 7, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
iphone 16 plus smartphone gets massive discount on amazon full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X