Home
Mobile

భారీ డిస్‌ప్లే, క్యాప్చర్‌ బటన్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌తో ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లు విడుదల

ఆపిల్ ఐఫోన్‌ 16 సిరీస్‌ మోడళ్లు లాంచ్ అయ్యాయి. its Glowtime event లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లుగా (iphone 16 pro and iphone 16 pro max) అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రో మోడళ్లు అనేక మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు గత సిరీస్‌ మోడళ్ల కంటే పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. దీంతోపాటు కెమెరా విభాగం కూడా అప్‌గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌ 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మ్యాక్స్ మోడల్ 6.9 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ రెండు ఫోన్ల డిస్‌ప్లేలు 120Hz ప్రో మోషన్ రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, అప్‌గ్రేడ్‌ అయిన సిరామిక్‌ షీల్డ్ రక్షణను కలిగి ఉంటుంది.

iphone 16 pro and iphone 16 pro max Smartphones display

ఐఫోన్‌ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు ఆపిల్ సెకండ్‌ జనరేషన్‌ 3nm A18 ప్రో చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు iOS 18 (Out of the box) పైన పనిచేస్తుంది. iOS 18.1 అందుబాటులోకి వచ్చిన అనంతరం ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను సపోర్టు చేయనున్నాయి.

ఈ రెండు ప్రో మోడళ్లు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. f/1.78 అపేచర్‌తో కూడిన 48MP వైడ్‌ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 48MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, f/2.8 అపేచర్‌, టెట్రా ప్రిజమ్‌ పెరిస్కోప్‌ లెన్స్‌, 5X ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో 12MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

iphone 16 pro and iphone 16 pro max Smartphones display

దీంతోపాటు ఈ ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/1.9 అపేచర్‌తో కూడిన 12MP ట్రూ డెప్త్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 120fps వద్ద 4k నాణ్యతతో కూడిన వీడియోలను రికార్డు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ మోడళ్లు క్యాప్టర్‌ బటన్‌తో లాంచ్ అయ్యాయి. ఫలితంగా కెమెరాలను వేగంగా నియంత్రించే అవకాశం సొంతమవుతుంది.

అయితే బ్యాటరీ సామర్థ్యంపై ఆపిల్‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై 6E, GPS, NFC, USB-3.0 వంటి ఫీచర్లను కలిగి ఉంది.

iphone 16 pro and iphone 16 pro max Smartphones display

ఐఫోన్‌ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ధర, సేల్ వివరాలు :
భారత్‌లో ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,29,990, 1TB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,69,900 గా ఉంది. అదే ఐఫోన్‌ 16 ప్రో మ్యా్క్స్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 మరియు 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,84,900 గా ఉంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సెస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.5000 తగ్గింపును పొందవచ్చని ఆపిల్‌ వెల్లడించింది. మరియు 3 లేదా 6 నెలలపాటు నో కాస్ట్‌ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపింది. డిజర్ట్‌ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్‌ టైటానియం రంగుల్లో లభించనుంది.

ఐఫోన్‌ 16 ప్రో మోడళ్ల ముందస్తు బుకింగ్‌లు సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. మరియు సెప్టెంబర్ 20 నుంచి ఆపిల్ వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌ 16 ప్రో మోడళ్లు భారత్‌లో డ్యూయల్ సిమ్ (నానో +eSim) ను సపోర్టు చేస్తాయి. ఐఫోన్ 16 ప్రో మోడళ్లు 1TB గరిష్ఠ స్టోరేజీని సపోర్టు చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 16 pro and iphone 16 pro max Smartphones launched with 48MP ultra wide camera and capture button
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X