48MP అల్ట్రా వైడ్ కెమెరాకు అప్‌గ్రేడ్ కానున్న ఐఫోన్ 16 ప్రో కెమెరా... కొత్త ఫీచర్లేంటి..?
ఐఫోన్ 16 సిరీస్ భారత్ మార్కెట్‌లో కొన్ని నెలల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గురించి అనేక వివరాలు లీకవుతున్నాయి. తాజాగా ఈ కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి కీలక వివరాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో అందుబాటులోకి రానున్న ఐఫోన్ 16 ప్రో మోడల్ (iPhone 16 Pro Smartphone).. శాంసంగ్ CMOS ఇమేజ్ సెన్సార్‌ను కలిగి ఉండనున్నాయని తెలుస్తోంది. 3 వాఫర్ డిజైన్‌తో రానుంది. దీనిపై ఆపిల్ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇప్పటికే ఆపిల్ ఐఫోన్‌ల కెమెరాల సెన్సార్‌లను సోనీ సరఫరా చేస్తుండగా.. శాంసంగ్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. Elec నివేదికల ఆధారంగా ఈ శాంసంగ్ CMOS ఇమేజ్ సెన్సార్ల చివరి దశ నాణ్యత తనిఖీలను ఆపిల్ సంస్థ చేపట్టినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ సమయంలో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా ఆపిల్ సంస్థ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆపిల్ సంస్థ తన పోటీ సంస్థల కెమెరా విభాగం పురోగతిని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కెమెరా విభాగానికి ఆధునిక సాంకేతికత జోడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం సెన్సార్ అంతర్గత భాగాలను వేరుచేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఓ నివేదిక వెల్లడించింది.
కొన్ని నివేదికల ఆధారంగా ఐఫోన్ 16 ప్రో మోడల్ 48MP అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గత మోడల్ 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగి ఉంది. దీంతోపాటు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తరహాలో... ఐఫోన్ 16 ప్రో టెట్రాప్రిజమ్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లెన్స్ 5X జూమింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
దీంతోపాటు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆపిల్ తన ఐఫోన్‌లకు యాంటీ రిఫ్లక్టివ్ కోటింగ్ టెక్నాలజీని ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని అటామిక్ లేయర్ డిపోజిషన్ గా పేర్కొంటారు. అయితే ఈ టెక్నాలజీ కేవలం ఐఫోన్ 16 ప్రో హ్యాండ్‌సెట్ మాత్రమే కలిగి ఉంటుందా లేదా ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే టెక్నాలజీతో లాంచ్ కానుందా తెలియాల్సి ఉంది.
ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 19:6:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు మైక్రో లెన్స్ అర్రే OLED టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా డిస్‌ప్లే గతం కంటే 20 శాతం ప్రకాశవంతంగా ఉంటుందని సమాచారం. దీంతోపాటు టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని, 1.2mm సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఐఫోన్ 16 ప్రో స్పే్స్ బ్లాక్, వైట్, గ్రే మరియు రోజ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. మరియు పవర్, వాల్యూమ్, క్యాప్చర్ బటన్ కోసం ఫిజికల్ బటన్‌కు బదులుగా కెపాసిటివ్ టచ్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








