Home
Mobile

రూ.17,500 డిస్కౌంట్ ధరతో ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ను కొనుగోలు చేయండి... ఈ ఆఫర్‌ 3 రోజులు మాత్రమే..!

ఐఫోన్‌ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు (Apple iPhone 16 series) భారత్‌ మార్కెట్‌లో 2024 సెప్టెంబర్‌ నెలలో విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ఐఫోన్‌ 16 డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఇదో మంచి అవకాశం. ప్రస్తుతం ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ (iPhone 16 Pro Model Price drop) 128GB, 256GB స్టోరేజీ, 1TB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉండేది. ప్రస్తుతం విజయ్‌ సేల్స్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.1,06,900 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.13,000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

iphone 16 pro model pricedrop

దీంతోపాటు SBI, RBL, HDFC, ICICI, కోటక్‌ బ్యాంకు కార్డుల ద్వారా అదనంగా రూ.4500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ ధర రూ.1,02,400 కి తగ్గుతుంది. మొత్తంగా విడుదల ధరతో పోలిస్తే రూ.17,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. విజయ్‌ సేల్స్‌లో (Vijay sales iPhone Offers) జనవరి 5 వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఐఫోన్ 16 ప్రో మోడర్‌ 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,12,900 గా ఉంది. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.5645 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.1,07,255 గా ఉంది. దీంతోపాటు క్రోమాలోనూ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :

ఈ ప్రో మోడల్‌ 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz ప్రో మోషన్ రీఫ్రెష్‌ రేట్, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్‌ షీల్డ్ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ ప్రో మోడల్‌ హ్యాండ్‌సెట్‌ f/1.78 అపేచర్‌తో కూడిన 48MP వైడ్‌ ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 48MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, f/2.8 అపేచర్‌, 5X ఆప్టికల్ జూమ్‌, టెట్రా ప్రిజమ్‌ పెరిస్కోప్‌ లెన్స్‌తో 12MP టెలిఫోటో కెమెరాను అమర్చి ఉంది.

120fps వద్ద 4k నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను అమర్చారు. క్యాప్చర్‌ బటన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ సెకండ్‌ జనరేషన్‌ 3nm A18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. iOS 18.1, మెరుగైన బ్యాటరీ ఫీచర్‌లను కలిగి ఉంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్‌, GPS, NFC, USB-3.0 వంటి ఫీచర్లను కలిగి ఉంది. డిజర్ట్‌ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్‌ టైటానియం రంగుల్లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 16 pro model gets RS17500 discount on vijay sales offer valid upto january 5th 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X