Home
Mobile

ఐఫోన్‌ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే సమాచారం లీక్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు..!

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఈ సంవత్సరం చివర్లో భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఐఫోన్‌ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (iPhone 16 Pro) గత మోడల్‌ కంటే అప్‌గ్రేడ్‌ చేసిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ మోడల్‌ పెద్ద ప్యానల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అప్‌గ్రేడ్‌ చేయబడిన చిప్‌, క్యాప్చర్‌ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టిప్‌స్టర్‌ ఇన్‌స్టంట్‌ డిజిటల్‌ నివేదిక ప్రకారం ఐఫోన్‌ 16 ప్రో హ్యాండ్‌సెట్‌ 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను (SDR) కలిగి ఉంటుందని అంచనా వేశారు. గత మోడల్‌ కంటే 20 శాతం బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అదే HDR కంటెంట్‌ సమయంలో 1600 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ ప్రో మోడల్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ మెరుగవడంతోపాటు గత మోడల్‌ కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

iphone 16 pro model may offer more brightness

కొన్ని నివేదికల ఆధారంగా ఐఫోన్ 16 ప్రో మోడళ్లు.. ఐఫోన్ 16 ప్రో మోడల్‌ 6.27 అంగుళాల డిస్‌ప్లే మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ 6.85 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ గరిష్ఠంగా 4676mAh బ్యాటరీ గా ఉంది.

అదే ఐఫోన్ 16 ప్రో 3355mAh బ్యాటరీ, ఐఫోన్ 16.. 3,516mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ఐఫోన్ 16 ప్లస్‌ మాత్రం 4006mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నివేదిక ఆధారంగా ఐఫోన్‌ 16 ప్లస్‌ (iPhone 16 Plus Smartphone) ఏడు రంగుల్లో అండుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లూ, పింక్, యెల్లో, గ్రీన్‌, బ్లాక్‌, వైట్‌, పర్పల్ రంగుల్లోను విడుదల కానుందని తెలుస్తోంది. weibo ఆధారిత లీక్‌లు ఈ విషయాన్ని వెల్లడించాయి.

అయితే ఐఫోన్ 16 ప్రో మోడళ్లు స్పేస్‌ బ్లాక్‌, రోజ్‌ టైటానియం రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటీవలే మరో లీక్‌ వెలుగులోకి వచ్చింది. ఐఫోన్‌ 16 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు గత మోడల్‌ కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ పరంగాను గత మోడళ్లు కంటే ఐఫోన్‌ 16 సిరీస్ అప్‌గ్రేడ్‌ ఫీచర్ల, స్పెసిఫికేషన్లతో లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. స్టాండర్డ్‌ మోడళ్లు అప్‌గ్రేడ్‌ చేసిన A17 చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడళ్లు అడ్వాన్స్‌డ్‌ A18 ప్రో చిప్‌సెట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్‌ వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone 16 pro model may offer more brightness than iphone 15 pro smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X