కోటీశ్వరుల కోసమే ప్రత్యేకంగా.. కేవియర్ వాలెంటైన్స్ డే ఐఫోన్ 16 ప్రో కలెక్షన్.. పిక్స్ చూస్తే మతిప
iPhone 16 Pro: లగ్జరీ బ్రాండ్ 'కేవియర్’ ప్రేమికుల రోజు కోసం స్పెషల్ 'ఐఫోన్ 16 ప్రో’ సిరీస్‌ను రిలీజ్ చేసింది. దీనికి 'సీక్రెట్ లవ్ కలెక్షన్’ అని పేరు పెట్టారు. ముత్యాల స్ఫూర్తితో చేసిన ఈ కలెక్షన్‌లో మూడు డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయి: 'బొకే డోర్’, 'సెర్పెంటిస్ పెర్ల్’, 'సీ ఆఫ్ లవ్’. ప్రతి ఒక్క వెర్షన్‌లోనూ అదిరిపోయే డిజైన్, ఖరీదైన మెటీరియల్స్ వాడారు.
* బొకే డోర్.. ప్రేమికుల రోజుకి అల్టిమేట్ గిఫ్ట్
'బొకే డోర్’ గురించి కేవియర్ చెబుతూ.. “ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్, ప్రేమికుల రోజు ఇవ్వడానికి దీనికంటే గొప్పది మరొక ఉండదు” అని పేర్కొంది. ఈ ఫోన్ వెనుక భాగం మొత్తం మంచి క్వాలిటీ గల దూడ చర్మం (Calfskin)తో కవర్ చేశారు. దానిపై ముత్యపు సీతాకోకచిలుకలతో డెకరేట్ చేశారు.

అంతేకాదు, 24 క్యారెట్ల రోజ్ గోల్డ్ పూత రెండు లేయర్లుగా వేశారు. 'వాన్ క్లీఫ్ & ఆర్పెల్స్’ ఫ్లోరల్ డిజైన్స్, రెనెసాన్స్ కాలం నాటి స్టైల్స్ నుంచి ఈ డిజైన్ తీసుకున్నారు. చూసేందుకు ఇది చాలా అద్భుతంగా కనిపించింది. డబ్బులున్న వారు ఇలాంటివి కచ్చితంగా కొనాల్సిందే.
* సెర్పెంటిస్ పెర్ల్ ప్రేమకు చిహ్నం..
'సెర్పెంటిస్ పెర్ల్’ వెర్షన్‌లో.. ఫోన్ వెనుక భాగంలో గుండె ఆకారంలో ఒక బంగారు పాము ఉంటుంది. ఇది ప్రేమకు, కొత్తదనానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగాన్ని లేత క్రీమ్ కలర్ తోలుతో కవర్ చేసి, సహజ ముత్యాలతో అలంకరించారు.
పాముతో సహా మిగతా డిజైన్ మొత్తం 24 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో పూత పూశారు. 'బుల్గారి’ జ్యూయలరీ డిజైన్ల నుండి స్ఫూర్తి పొంది దీన్ని తయారు చేశారు. చూసేందుకు ఇది భయానకంగానే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందరిలో స్పెషల్ అవ్వాలంటే ఇది కొనాల్సిందే.
* సీ ఆఫ్ లవ్ – కళ నుంచి పుట్టింది..
'సీ ఆఫ్ లవ్’ ఎడిషన్ డిజైన్‌ను 'సాండ్రో బొట్టిసెల్లి’ వేసిన 'ది బర్త్ ఆఫ్ వీనస్’ పెయింటింగ్ నుంచి తీసుకున్నారు. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్‌ను పింక్ దూడచర్మంతో కవర్ చేసి, బంగారుపూత పూసిన గవ్వ, ముత్యాలు, ముత్యపు చిప్పలు, డైమండ్స్‌తో డెకరేట్ చేశారు. ఈ డిజైన్ క్లాసిక్ ఆర్ట్‌ను మోడ్రన్ లగ్జరీతో కలిపి చూపిస్తుంది.
* ధరలు, ఎక్కడ దొరుకుతాయి
కేవియర్ ఒక్కో మోడల్‌లో 99 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోంది. ఇవి చాలా స్పెషల్ ఫోన్స్. 'యాపిల్ ఐఫోన్ 16 ప్రో’ వెర్షన్ ధరల చూస్తే బొకే డోర్ 9,630 డాలర్లు (రూ.8 లక్షలు). సెర్పెంటిస్ పెర్ల్ 9,990 డాలర్లు (దాదాపు రూ.8.30 లక్షలు). సీ ఆఫ్ లవ్ 11,630 డాలర్లు (రూ.9.7 లక్షలు).
ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్స్ ధరలు చూస్తే బొకే డోర్ 9,910 డాలర్లు (రూ.8 లక్షల 25 వేలు). సెర్పెంటిస్ పెర్ల్ 10,270 డాలర్లు (రూ.8 లక్షల 55 వేలు). సీ ఆఫ్ లవ్ 11,910 డాలర్లు (రూ.9 లక్షల 90 వేలు).
సాధారణ ఐఫోన్ 16 ప్రో మోడల్స్ కొనాలనుకునేవారికి కొన్ని వెబ్‌సైట్లు తక్కువ ధరలకే అందిస్తున్నాయి. 128GB స్టోరేజ్ + 8GB RAM కలిగిన ఐఫోన్ 16 ప్రో మోడల్ అసలు ధర 999.99 డాలర్లు, ఇప్పుడు 856.56 డాలర్లకు లభిస్తోంది.
అలాగే, 256GB + 8GB RAM వేరియంట్ అసలు ధర 1,099.99 డాలర్లు ఉండగా, ఇప్పుడు 949.91 డాలర్లకు లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఆఫర్ల విషయానికి వస్తే, 256GB + 8GB RAM మోడల్ 1,082.74 డాలర్లు లేదా 1,280.00 యూరోలకు దొరుకుతుంది.
512GB + 8GB RAM మోడల్ 1,288.13 డాలర్లు లేదా 1,499.38 యూరోలకు లభిస్తున్నాయి. కేవియర్ 'సీక్రెట్ లవ్ కలెక్షన్’ గురించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ లగ్జరీ ఐఫోన్స్ టెక్నాలజీని అందంతో కలిపి, ప్రేమికుల రోజుకి నిజంగా చాలా స్పెషల్ గిఫ్ట్‌గా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications








