Home
Mobile

iPhone 16 Pro VS iPhone 15 Pro ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15 ప్రో మధ్య తేడాలేంటి.. పూర్తి వివరాలు..!

ఆపిల్‌ గత రాత్రి ఆపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ మినహా మిగిలిన మూడు మోడళ్లు గత సిరీస్‌ తరహా ధరలను కలిగి ఉన్నాయి. అయితే ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ మాత్రం.. ఐఫోన్‌ 15 ప్రో మోడల్ కంటే తక్కువ ధరకే (iPhone 16 Pro VS iphone 15 pro) విడుదల అయింది.

అయితే తాజాగా ఆపిల్‌ ఐఫోన్ 15 ప్రో మోడల్‌ను తన వెబ్‌సైట్లో విక్రయాలను నిలిపివేసింది. అయితే ఇతర ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలో ఈ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 16 ప్రో మోడల్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,29,990, 1TB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.1,69,900 గా ఉంది.

iPhone 16 Pro VS iphone 15 pro smartphone

ఆపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో 6.1 అంగుళాల LTPO సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఆపిల్‌ A17 ప్రో SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. అదే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఫోన్‌ 16 ప్రో 6.3 అంగుళాల LTPO సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్‌ A18 ప్రో SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

గత మోడల్‌తో పోలిస్తే ఐఫోన్‌ 16 ప్రో పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు సన్నని బెజెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే టఫ్‌ సిరామిక్‌ షీల్డ్‌ రక్షణను కలిగి ఉంటుంది. డిజైన్ సహా ఇతర అంశాల్లో రెండు మోడళ్లు ఒకే తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ ఆపిల్‌ A18 ప్రో చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్‌గా పరిగణించవచ్చు. 15 ప్రో మోడల్‌ A17 ప్రో చిప్‌సెట్‌పై పనిచేస్తోంది. టెక్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త హ్యాండ్‌సెట్‌ 20 శాతం వేగవంతమైన GPU మరియు మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఐఫోన్‌ 15 ప్రో f/1.8 అపేచర్‌, OIS, డ్యూయల్‌ పిక్సల్‌ PDAF తో కూడిన 48MP ప్రధాన కెమెరా. f/2.2 అపేచర్‌ 120 డిగ్రీల 12MP అల్ట్రావైడ్ కెమెరా మరియు f/2.8 అపేచర్‌, OIS, 3X ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో టెలిఫోటో 12MP కెమెరాను కలిగి ఉంది. f/1.9 అపేచర్, PDAF తో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

అదే ఐఫోన్ 16 ప్రో f/1.8 అపేచర్‌, షిఫ్ట్ OIS, డ్యూయల్‌ పిక్సల్ 48MP కెమెరా, f/2.2 అపేచర్, 120 డిగ్రీల అల్ట్రావైడ్‌ 48MP కెమెరాను కలిగి ఉంది. మరియు f/2.8 అపేచర్‌, PDAF, OIS, 5X ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 12MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. f/1.9 అపేచర్‌, PDAF 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ రెండు మోడళ్లు 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే ఐఫోన్‌ 16 ప్రో సిరీస్‌ 48MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. ఫలితంగా తక్కువ వెలుగులోనూ నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో టెలిఫోటో కెమెరా 3X జూమింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 16 ప్రో మోడల్‌ 5x జూమ్‌ సామర్థ్యంతో లాంచ్‌ను కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్, బ్యాటరీ పరంగా ఈ రెండు మోడళ్లు కొత్త వెర్షన్‌ లపైన పనిచేస్తున్నాయి. ఐఫోన్ 16 ప్రో హ్యాండ్‌ సెట్‌ గత మోడల్‌ కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తుంది. దీంతోపాటు Magsafe వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

ఐఫోన్ 15 ప్రో ప్రస్తుత ధర రూ.1,24,200 గా ఉంది. అయితే కొత్త మోడల్ కంటే పాత మోడల్ ధరే ఎక్కువగా ఉంది. మరియు కొత్త మోడల్‌ ధర తక్కువగా ఉన్నా.. అనేక అప్‌గ్రేడ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సహా అనేక ఫీచర్లను సపోర్టు చేయనుంది.

Best Mobiles in India

English summary
iPhone 16 Pro VS iphone 15 pro what are the differences between these Pro models full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X