ఐఫోన్ 17 సిరీస్ విడుదల నేపథ్యంలో.. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!
దిగ్గజ సంస్థ ఆపిల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ నెలలో విడుదల కానుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 9 లేదా 10 విడుదలయ్యే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్‌ను (iPhone 16 Series) డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ రూ.59900 ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అమెజాన్ లో 128GB వేరియంట్ ధర రూ.53499 గా ఉంది. SBI, ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ మోడల్‌ను రూ.49499 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ :
ఐఫోన్ 16 మోడల్ గత సంవత్సరం భారత్‌లో 128GB స్టోరేజీ వేరియంట్ రూ.79900 కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ప్రారంభ ధర రూ.66499 గా ఉంటుంది.
ఐఫోన్ 16 ప్లస్ మోడల్ :
గత సంవత్సరం ఐఫోన్ 16 ప్లస్ భారత్ మార్కెట్‌లో రూ.89900 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79999 కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.75999కే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మోడల్ :
ఈ ప్రో మోడల్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.1,19,900 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.112900 ధరకు అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డుపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.1,09,900 గా ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ :
ఈ ఫోన్ గత సంవత్సరం విడుదల అయింది. లాంచ్ సమయంలో 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.144990 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ ఈ ఫోన్ ధర రూ.1,34,900 గా ఉంది. SBI క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.3 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.1,31,900 కే సొంతం చేసుకోవచ్చు.
ఇండియాలో ఆపిల్ మూడో రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. బెంగళూరులో Apple Hebbal స్టోర్‌ను సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ముంబై BKC, ఢిల్లీ సాకేత్ స్టోర్‌లను ప్రారంభించింది.
ఆపిల్ బెంగళూరు స్టోర్‌కు సంబంధించిన డిజైన్‌ను కూడా విడుదల చేసింది. నెమలిని పోలిన డిజైన్, కలర్స్‌ను కలిగి ఉంది. ఈ స్టోర్‌లో ఆపిల్ యూజర్లు సహా ఇతరులు నేరుగా ఆపిల్ స్పెషలిస్ట్‌లతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆపిల్ టు డే సెషన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది.
Note : ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించిన కథనం రాస్తున్న సమయంలో ఉన్న ధరలను ప్రచురించడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా ఎప్పుడైనా వీటి ధరల్లో మార్పులు రావచ్చు.


Click it and Unblock the Notifications








