Home
Mobile

ఐఫోన్‌ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల కీలక వివరాలు లీక్‌.. గత మోడళ్ల కంటే మెరుగైన ఫీచర్లతో లాంచ్‌..!!

ఆపిల్ నుంచి ఈ సంవత్సరం ఐఫోన్‌ 16 సిరీస్‌ (iPhone 16 series) విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి ఇప్పటికే కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం మాదిరిగానే ఐఫోన్ 16 సిరీస్‌ నాలుగు మోడళ్లను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఈ సంవత్సరంలో లాంచ్ కానున్నాయి.

అయితే గత మోడల్‌ ఫోన్ల కంటే ఐఫోన్‌ 16 సిరీస్‌ (iPhone 16 series leaked Details) చిప్‌సెట్‌, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ అప్‌గ్రేడ్‌లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే భారీ మార్పులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

iPhone 16 series smartphone key features leaked

అయితే ప్రస్తుతం వచ్చిన లీక్‌ల ఆధారంగా క్యాప్చర్‌ బటన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు హ్యాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుందని సమాచారం. అయితే స్టాండర్డ్ మోడళ్లు మాత్రమే Action బటన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు అన్ని మోడళ్లు USB-C ఛార్జింగ్ పోర్టు, పంచ్‌ హోల్‌ డిజైన్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

దీంతోపాటు చిప్‌సెట్‌ పరంగాను గత మోడళ్లు కంటే ఐఫోన్‌ 16 సిరీస్ అప్‌గ్రేడ్‌ చేయబడి లాంచ్‌ కానున్నాయని లీక్‌ల ఆధారంగా తెలుస్తోంది. ఐఫోన్‌ స్టాండర్డ్‌ మోడళ్లు అప్‌గ్రేడ్‌ చేసిన A17 చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడళ్లు అడ్వాన్స్‌డ్‌ A18 ప్రో చిప్‌సెట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఫోన్‌ వేడెక్కకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

గత మోడళ్లు కంటే ఈ కొత్త సిరీస్‌ హ్యాండ్‌సెట్లు పెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్‌ 16 మోడల్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్లస్‌ మోడల్‌ 6.7 అంగుళాలు, ప్రో మోడల్‌ 6.3 అంగుళాలు, ప్రో మ్యాక్స్‌ మోడల్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అదే ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లు సన్నని బెజెల్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 16 మోడల్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.

దీంతోపాటు ఐఫోన్ 16 సిరీస్‌ మోడళ్లు.. త్వరలో అందుబాటులోకి రానున్న iOS 18 వెర్షన్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. ఆపిల్‌ కొత్త OS జనరేటివ్‌ AI సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మరియు విజన్‌OS తరహా డిజైన్‌తో వస్తుంది. Siri ని మరింత మెరుగుపరిచేందుకు కొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఏఐ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 16 సిరీస్‌ మోడళ్లు ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది. 40W వైరడ్‌ ఛార్జింగ్‌ మరియు 20W మెగ్‌సెఫ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 16 బేస్‌ మోడల్‌ 3,561mAh బ్యాటరీ, అదే ప్లస్ మోడల్‌ 4006mAh బ్యాటరీలను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మ్యాక్స్‌ 4,676mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్‌ ప్రో మోడళ్లు 48MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. అదే ప్రో మ్యాక్స్‌ హైబ్రిడ్‌ లెన్స్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లు 5X టెలీఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. అదే బేస్, ప్లస్‌ మోడళ్లు వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 16 series smartphone key features leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X