iPhone 16 Series Sale భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ సేల్.. ఈ ప్రాంతాల్లో నిమిషాల్లో డెలివరీ..!
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ భారత్‌లో ఇవాళ ప్రారంభం (Apple iPhone 16 Series Sale) అయింది. దీంతో ఢిల్లీ, ముంబయిలోని ఆపిల్ స్టోర్‌ల ముందు భారీగా క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ వెబ్‌సైట్ సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల డెలివరీకి Blinkit ముందుకొచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో నిమిషాల వ్యవధిలోనే ఐఫోన్‌లను డెలివరీ చేస్తోంది.
ఇందుకోసం Unicorn ఇన్ఫో సొల్యూషన్స్‌తో Blinkit భాగస్వా్‌మ్యం (Blinkit To Deliver iPhone 16 Series in Minutes) కుదుర్చుకుంది. ఇవాళ ఉదయం నుంచే ఐఫోన్ల డెలివరీని ప్రారంభించినట్లు Blinkit వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా X ప్లాట్‌ఫాం వేదికగా వెల్లడించారు. ఈ రోజు 'Crazy Day' గా గుర్తిండిపోతుందని అంటూ కామెంట్ చేశారు.

ఆపిల్ ప్రీమియం భాగస్వామి అయిన యూనికార్న్ ఇన్ఫోసొల్యుషన్స్‌తో తాము వరుసగా మూడో సంవత్సరం కూడా జతకట్టినట్లు చెప్పారు. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ (NCR నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబై, పూణే, బెంగళూరు, లక్నో వంటి ప్రాంతాల్లో ఐఫోన్ 16 సిరీస్ హ్యాండ్‌సెట్‌లను నిమిషాల వ్యవధిలోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్నామని చెప్పారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై యూనికార్న్ ఆఫర్లు, EMI ప్రయోజనాలు అందిస్తుందని తెలిపారు.
ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్ సిరీస్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతోపాటు క్యాప్చర్ బటన్, యాక్షన్ బటన్‌లను కలిగి ఉంది. ఈ సిరీస్ iOS 18 సహా ఆపిల్ A18 చిప్‌సెట్ తో పనిచేస్తున్నాయి.
ఐఫోన్ 16 ప్రారంభ ధర (128GB స్టోరేజీ వేరియంట్) రూ.79,900 గా ఉంది. అదే 256GB స్టోరేజీ ధర రూ.89,900, 512GB స్టోరేజీ ధర రూ.1,09,900 గా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ ధర రూ.89,900, 256GB స్టోరేజీ ధర రూ.99,900, 512GB స్టోరేజీ ధర రూ.1,19,900 గా ఉంది.
అదే ప్రో మోడల్ హ్యాండ్‌సెట్ ధరల విషయానికి వస్తే ఐఫోన్ 16 ప్రో 128GB స్టోరేజీ ధర రూ.1,19,900, 256GB స్టోరేజీ ధర రూ.1,29,900, 512GB స్టోరేజీ ధర రూ.1,49,900, 1TB స్టోరేజీ ధర రూ.1,69,900 గా ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256GB స్టోరేజీ ధర రూ.1,44,900, 512GB స్టోరేజీ ధర రూ.1,64,900, 1TB స్టోరేజీ ధర రూ.1,84,900 గా ఉంది.
ఐఫోన్ 16, ప్లస్ మోడళ్లు బ్లాక్, పింక్, టీల్, అల్ట్రామెరిన్, వైట్ రంగుల్లో లభిస్తాయి. అదే ప్రో మోడళ్లు బ్లాక్ టైటానియం, డిజర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో లభిస్తాయి. ఆపిల్ స్టోర్‌లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 3 నుంచి 6 నెలలపాటు నోకాస్ట్ EMI సదుపాయాన్ని పొందవచ్చు. పాత ఐఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.67,500 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








