Home
Mobile

ఐఫోన్ 17 ఎయిర్‌ మోడల్‌ బ్యాటరీ వివరాలు లీక్.. హైస్పీడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో..!

iPhone 17 Air Smartphone : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ ఈ సెప్టెంబర్‌ నెలలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ప్లస్‌ మోడల్‌కు బదులుగా ఎయిర్‌ మోడల్‌ను ఈసారి లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఐఫోన్ 17 ఎయిర్‌ బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ Majin Bu ఈ వివరాలను వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2900mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఛార్జింగ్ స్పీడ్‌ వివరాలు వెల్లడి కాలేదు.

iPhone 17 Air Battery details tipped and expected to get high speed charging

హైస్పీడ్‌ ఛార్జింగ్ :
అయితే హైస్పీడ్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్‌ సన్నని డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. మరియు అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ 17 ఎయిర్‌ అంచనా వివరాలు :
ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్‌ A19 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ iOS 26 పైన పనిచేస్తుందని సమాచారం. దీంతోపాటు అనేక ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

కెమెరా విభాగం పరంగా గతంలో పోలిస్తే అనేక మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ వెనుక వైపు ఒకే కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 48MP కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 24MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

బెస్ట్‌ కెమెరా సామర్థ్యాలు :
గత నెలలో ఐఫోన్ 17 ప్రో మోడల్స్ గురించి కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. MacRumors ద్వారా ఈ వివరాలు బయటకొచ్చాయి. దీని ఆధారంగా ప్రో మోడల్‌ ఫోన్‌లు బెస్ట్‌ కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడల్‌ 8x ఆప్టికల్‌ జూమింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిసింది. కెమెరా విభాగం పరంగా ఇదే బెస్ట్ ఫీచర్‌గా భావించవచ్చు.

దీంతోపాటు ప్రత్యేకంగా ప్రో కెమెరా యాప్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా అడ్వాన్స్‌డ్‌ ఫోటో, వీడియో టూల్స్‌ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ప్రో కెమెరా యాప్‌ కేవలం ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌ కు మాత్రమే పరిమితం అవుతుందా, గత ఐఫోన్ సిరీస్‌లకు కూడా అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌ రెండో కెమెరా కంట్రోల్‌ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా కెమెరా సెట్టంగ్స్, ఫీచర్లకు క్విక్‌ యాక్సెస్‌ అందిస్తుందని తెలిపారు. ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌ స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ మరియు యాంటీ రిఫ్లక్టివ్‌ డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 17 Air Battery details tipped and expected to get high speed charging
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X