ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని డిజైన్ మార్పులు.. లీక్స్ వైరల్!
యాపిల్ ఐఫోన్లు ఎప్పటికప్పుడు కొత్త అప్‌గ్రేడ్స్, టెక్నాలజీలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 16 సిరీస్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అయితే 2025 సెకండాఫ్ ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుందని సమాచారం. యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కొత్త సిరీస్‌లో 4 అదిరిపోయే మోడల్స్ ఉండనున్నాయి.
అవేంటంటే.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ (దీన్నే ఐఫోన్ 17 ఎయిర్ అని కూడా అంటున్నారు), ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్. వీటన్నిటిలో ఈసారి హాట్ టాపిక్‌గా మారింది మాత్రం ఐఫోన్ 17 స్లిమ్ గురించే అని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా దీని చుట్టూ ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన లీక్ (Design leak) తెరపైకి వచ్చింది.

ఈ లీక్ ప్రకారం ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ గత మోడల్స్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. 'ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్' అనే వీబో యూజర్ ఈ విషయాన్ని లీక్ చేశాడు. ఆ యూజర్ ప్రకారం, కొత్త ఐఫోన్ 17 సిరీస్ సరికొత్త ఫిజికల్ ఫీచర్లతో రానుంది.
ఫోన్ బాడీకి, వెనుక భాగానికి మధ్య ఉండే కనెక్షన్ ఏరియాలో స్టెప్-లాంటి ట్రాన్సిషన్ కాకుండా వాలుగా ఉంటుందట. దీన్ని బట్టి చూస్తే, యాపిల్ పాత ఐఫోన్ మోడల్స్, అంటే ఐఫోన్ 6 తరహాలో రౌండెడ్ ఏడ్జ్‌లను మళ్లీ తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇలాంటి డిజైన్ ఉంటే ఫోన్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు మరింత కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది.
* ఈ డిజైన్ ఒక్కదానికే పరిమితమా
ఈ డిజైన్ మార్పు ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడల్స్‌లో కనిపించనుందా లేక కొన్ని ప్రత్యేకమైన మోడల్స్‌కు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఐఫోన్ 16 సిరీస్‌లో ఫ్లాట్ సైడ్స్‌తో పాటు కొద్దిగా రౌండెడ్ ఏడ్జెస్ ఉన్నాయి.
ఒకవేళ యాపిల్ మళ్లీ కర్వ్డ్ డిజైన్‌కు వెళితే, ఓల్డ్ ఐఫోన్ మోడల్స్ లాగే ఈ ఫోన్లు కూడా పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటాయని చెప్పొచ్చు.
* గతంలోనూ లీక్స్
నిజానికి ఐఫోన్ 17 డిజైన్‌కు సంబంధించి ఇలాంటి లీకులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఒక లీక్ ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో కెమెరా లేఅవుట్ పూర్తిగా కొత్తగా ఉండబోతోంది.
గూగుల్ పిక్సెల్ ఫోన్ల తరహాలో రౌండ్ ఎడ్జెస్ లేని పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్‌ను మనం చూడొచ్చు. ఇది ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ కెమెరా డిజైన్లకు పూర్తి డిఫరెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇంకో లీక్ ప్రకారం ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో టైటానియం ఫ్రేమ్‌కు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను యూజ్ చేయనున్నారట.
ఫీచర్ల విషయానికొస్తే, ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో యాపిల్ సరికొత్త A19 ప్రో చిప్‌తో పాటు 12GB RAM వాడొచ్చు. మరోవైపు, సాధారణ ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ (లేదా ఎయిర్) మోడల్స్‌లో A18 లేదా A19 చిప్‌ను ఉపయోగించొచ్చు. వీటిలో 8GB RAM ఉండొచ్చు.


Click it and Unblock the Notifications








