ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ కీలక వివరాలు లీక్.. ఈ సిరీస్ ఎప్పుడు విడుదల కానుంది..?
ఆపిల్ నుంచి గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది. ఇటీవల ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.59,990 గా ఉంది. ఆపిల్ నుంచి మరికొన్ని నెలల్లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సిరీస్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి.
ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series) నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 pro Max) మోడళ్లు లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తాజాగా ప్రో, ప్రో మ్యాక్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి.

ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ రెండు వేరియంట్స్ బ్యాక్ ప్యానల్స్.. అల్యూమినియం, గ్లాస్ డిజైన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రో మ్యాక్స్ మోడల్ 8.725mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఐఫోన్ 17 ప్రో (iPhone 17 pro) గత మోడల్ కంటే మెరుగైన డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ డిజైన్‌లో కీలక మార్పులను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 11 నుంచి ఒకే తరహా డిజైన్‌ను కలిగి ఉంటున్నాయి. అయితే ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో రౌండ్ కార్నర్స్‌తో కూడిన స్లీక్ డిజైన్ ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ జాన్ ప్రొసెర్ తెలిపారు.
ప్రో మోడల్ వెనుక వైపు.. మూడు కెమెరాలు ఒక వైపు.. LED ఫ్లాష్, LiDAR స్కానర్ మరో వైపు ఉంటుందని చెప్పారు. దీంతోపాటు డ్యూయల్ టోన్ ఫినిష్ కలిగి ఉంటుందని తెలిపారు. ప్రీమియం లుక్‌ను కలిగి ఉండే విధంగా అల్యూమినియం, గ్లాస్ తో కూడిన యూనిక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా స్పెసిఫికేషన్‌లలోనూ కీలక మార్పులను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడల్ 48MP టెలిఫోటో కెమెరాతోపాటు 24MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ టెలిఫోటో కెమెరా మెరుగైన జూమింగ్ సామర్థ్యాలను కలిగి ఉండడం సహా అడ్వాన్స్‌డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ను కలిగి ఉంటుందని సమాచారం.
ఆపిల్ ఐఫోన్‌లు శక్తవంతమైన చిప్‌సెట్‌లతో లాంచ్ అవుతున్నాయి. ఐఫోన్ 17 ప్రో మోడల్ కూడా A19 ప్రో చిప్‌సెట్, 12GB ర్యామ్ తో సూపర్ ఫెర్ఫామెన్స్ ను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 8GB ర్యామ్‌తో ఐఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరాతోపాటు ర్యామ్ పరంగానూ మెరుగైన అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59990 గా ఉంది. మరియు 60Hz రీఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ రక్షణను కలిగి ఉంటుంది.
ఈ ఐఫోన్ A18 చిప్‌సెట్, iOS 18 ను కలిగి ఉంది. మరియు ఆపిల్ ఇంటెలిజెన్స్, యాక్షన్ బటన్, శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్ తో మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ కేవలం వైట్, బ్లాక్ రంగుల్లోనే అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








