Home
Mobile

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌లో మీరు ఊహించని మార్పులు.. తాజా లీక్స్ ఆధారంగా ఇంకా ఏం వెల్లడయ్యాయి..?

iPhone 17 Pro Max : ఐఫోన్ 17 సిరీస్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌ గురించి అనేక లీక్స్‌ వచ్చాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 16 సిరీస్‌ కంటే అనేక అప్‌గ్రేడ్స్‌తో ఐఫోన్ 17 సిరీస్‌ విడుదల కానుందని ఇప్పటికే లీక్స్‌ వచ్చాయి.

అనేక విభాగాల్లో అప్‌గ్రేడ్స్ :
డిజైన్‌, చిప్‌సెట్‌, కెమెరా, బ్యాటరీ ఇలా అన్ని విభాగాల్లో అప్‌గ్రేడ్స్‌ రానున్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ గురించి కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఈ ప్రో మోడల్‌ బ్యాటరీ పరంగా భారీ అప్‌గ్రేడ్‌తో వస్తుందని తెలుస్తోంది. అయితే ఆపిల్‌ మాత్రం ఎటువంటి స్పందన తెలియజేయలేదు.

iPhone 17 pro Max

చైనా మైక్రోబ్లాకింగ్‌ ప్లాట్‌ఫాం Weibo మరియు టిప్‌స్టర్‌ ఇన్‌స్టంట్‌ డిజిటల్‌ వివరాల ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ఏకంగా 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. గత వేరియంట్‌ తో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్‌ గా భావించాలి. అయితే సాధారణంగా ఆపిల్‌ తన బ్యాటరీ వివరాలను అధికారికంగా వెల్లడించదు.

కేవలం స్క్రీన్‌ టైమ్‌ను మాత్రమే వెల్లడిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ 4676mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, 33 గంటల వీడియో ప్లేబ్యా్‌క్‌ టైం, 105 గంటల ఆడియో ప్లేబ్యాక్‌ టైమ్‌ ను అందిస్తుందని తెలుస్తోంది.

అధిక స్క్రీన్‌ టైం :
తాజాగా అందుబాటులోకి వచ్చిన లీక్స్‌ ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌.. గత వేరియంట్‌ కంటే అధిక స్క్రీన్‌ టైంను పొందుతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్.. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఐఫోన్‌ గా నిలిచే అవకాశం ఉంది.

దీంతోపాటు ఇదివరకే ఐఫోన్‌ 17 ప్రో మోడల్స్ గురించి అనేక లీక్స్‌ వచ్చాయి. ఈ వేరియంట్స్‌ సింగిల్‌, మల్టీ కోర్‌ స్కోర్‌ 4000, 10000 గా ఉన్నాయి. దీంతోపాటు ప్రో మోడల్స్‌ 3nm A19 ప్రో చిప్‌సెట్‌ తో పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వీటితోపాటు వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా సమర్థవంతమైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం పనిచేస్తుందని సమాచారం. A19 చిప్‌సెట్ ఎక్కువ హీట్‌ జనరేట్‌ చేస్తుందని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ కూలింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 8.725mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని లీక్స్‌ ఆధారంగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ బ్యాటరీని అందించేందుకు వీలుగానే థిక్‌నెస్‌ను పెంచినట్లు తెలుస్తోంది. అయితే ప్రో మోడల్‌లో బ్యాటరీ పరంగా మార్పులు ఉండవని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone 17 pro Max may get large battery compared to iphone 16 pro max model
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X