సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీతో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్.. కీలక వివరాలు లీక్..!
ఆపిల్ నుంచి ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన అనేక లీక్స్ వస్తున్నాయి. డిజైన్ పరంగా కొత్త హ్యాండ్‌సెట్‌లు కీలక మార్పులు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ (iPhone 17 pro Max) గురించి కీలక విషయాలు లీక్ అయ్యాయి. ఈ హైఎండ్ మోడల్ డిజైన్, కెమెరా మాడ్యూల్ పరంగా అనేక మార్పులతో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు మెరుగైన డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంటుందని సమాచారం.

టిప్‌స్టర్ jeff Pu వివరాల ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్ల డైనమిక్ ఐలాండ్ సైజు తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం డిస్‌ప్లేలో Metalens టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో తొలిసారి ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ కొత్తగా అనిపించే అవకాశం ఉంది.
ఇప్పటికే వరకు చాలా సిరీస్‌లో ప్రో మ్యాక్స్ మోడళ్లు అత్యాధునిక కెమెరా ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బ్యాక్ ప్యానల్ గ్లాస్ మరియు అల్యూమినియం బిల్ట్ ఆప్షన్‌లో వచ్చే అవకాశం ఉంది. కెమెరా పరంగాను భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. 48MP టెలిఫోటో లెన్స్‌తోపాటు 24MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ప్రో మ్యాక్స్ మోడల్ A19 ప్రో చిప్‌సెట్, 12GB ర్యామ్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే వారంలో ఆపిల్ నుంచి ఐఫోన్ SE 4 విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 వ తేదీన ఆపిల్ నుంచి కొత్త డివైస్ లాంచ్ కానుంది. నిన్న సీఈవో టిప్ కుక్ ట్వీట్ చేశారు.
అయితే ఏ డివైజ్ విడుదల కానుందో వెల్లడించలేదు. ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ ఆధారంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో SE 4 మోడల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 48MP ప్రైమరీ కెమెరా సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
A18 ప్రో చిప్‌సెట్, 8GB ర్యామ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 128GB ర్యామ్ సహా ఇతర స్టోరేజీ వేరియంట్స్‌లో లభించనుంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా ఫేస్ ఐడీ సహా మరిన్ని కీలక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారత్ మార్కెట్‌లో ఐఫోన్ SE 4 మోడల్ రూ.41,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చివరిగా మార్కెట్‌లో 2022 మార్చి నెలలో ఐఫోన్ SE 3 లాంచ్ అయింది. ఈ మోడల్ 4.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 4GB ర్యామ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌తో పోలిస్తే కొత్తగా లాంచ్ కానున్న వేరియంట్ భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా SE 4 హ్యాండ్‌సెట్.. ఐఫోన్ 14 తరహాలో బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే 3279mAh బ్యాటరీతో పనిచేస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే బ్యాటరీ పరంగానూ భారీ అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు. ఈ ఫోన్ ఈ వారంలోనే విడుదల కానుందని వార్తలు వచ్చినా.. లాంచ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








