ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.. అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16e హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. దీంతోపాటు మ్యాక్స్‌బుక్, ఐప్యాడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయి.
గత సిరీస్ కంటే ఐఫోన్ 17 సిరీస్ లో (Apple iPhone 17 Series) అనేక మార్పులు ఉండే అవకాశం ఉంది. డిజైన్, కెమెరా మాడ్యూల్ సహా పనీతీరులోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్ అవుతున్నాయి.

ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) లోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజైన్ పరంగా కెమెరా మాడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. స్వేర్ షేప్ బంప్ డిజైన్‌కు బదులుగా హారిజాంటల్ కెమెరా ఐలాండ్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మరియు గ్లాస్ కు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 12MP టెలిఫోటో కెమెరాకు బదులుగా 48MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా మరింత మెరుగైన కెమెరా పనితీరు అందిస్తుంది. అలాగే సెల్ఫీ కెమెరా కూడా 12MP నుంచి 24MP గా మార్పు చెందుతుందని భావిస్తున్నారు.
దీంతోపాటు ప్రో మోడల్ 3nm అండర్ ది హుడ్ A19 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌తో ప్రస్తుతం ఉన్న ఫోన్‌లతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. ఫోటోగ్రఫీ, గేమింగ్ సహా ఇతర విభాగాల సామర్థ్యాల్లో మార్పులను గమనించవచ్చని తెలుస్తోంది.
గత సిరీస్ ఆపిల్ ఫోన్‌లు 8GB ర్యామ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఐఫోన్ 17 ప్రో మోడల్ 12GB ర్యామ్‌తో అందుబాటులోకి వస్తుందని తెలిసింది. దీంతోపాటు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఎక్కువ సమయం వినియోగించినా ఫోన్ వేడెక్కకుండా ఉండేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బ్యాటరీ వివరాలు ఎప్పుడూ వెల్లడించని ఆపిల్.. ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో మాత్రం భారీ బ్యాటరీని అమర్చుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కనెక్టివిటీ పరంగా చూస్తే 5G, వైఫై 7 వంటి ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత లీక్స్ ఆధారంగా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై ఆపిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ సంవత్సరం జున్ 9 నుంచి 13 వరకు ఆపిల్ WWDC (వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్) ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో iOS 19 సహా ఐఫోన్ 17 ఎయిర్ సహా ఇతర ఉత్పత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వీటితోపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








