అదిరిపోయే కెమెరా ఫీచర్‌లతో ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. మూడు ప్రత్యేక ఫీచర్లు..!
iPhone 17 : ఆపిల్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ గురించి అనేక లీక్స్ వచ్చాయి. ఈ వివరాల ఆధారంగా గత సిరీస్‌తో పోలిస్తే ఐఫోన్ 17 సిరీస్, స్పెసిఫికేషన్లు ఫీచర్ల పరంగా అనేక అప్‌గ్రేడ్స్‌ను పొందనుంది.
8x వరకు జూమింగ్! :
తాజాగా ఐఫోన్ 17 ప్రో మోడల్స్ గురించి కీలక వివరాలు లీక్ అయ్యాయి. MacRumors ఆధారంగా ఈ వివరాలు లీక్ అయ్యాయి. ప్రో మోడల్స్ అనేక మెరుగైన కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ 5x జూమింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. అయితే ఐఫోన్ 17 ప్రో మోడల్ ఏకంగా 8x ఆప్టికల్ జూమ్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది.

ప్రో కెమెరా యాప్! :
ఫలితంగా ఎక్కువ దూరం నుంచి క్యాప్చర్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరియు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పరంగా ఇదో పవర్‌ఫుల్ ఫీచర్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యేకంగా ప్రో కెమెరా యాప్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా అడ్వాన్స్‌డ్ ఫోటో, వీడియో టూల్స్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
అయితే ఈ ప్రో కెమెరా యాప్ కేవలం ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌కు పరిమితం అవుతుందా లేదా ఇతర గత ఐఫోన్ సిరీస్‌లకు కూడా అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సిరీస్ విడుదల సమయంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కెమెరా కంట్రోల్ బటన్! :
దీంతోపాటు రెండో కెమెరా కంట్రోల్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా కెమెరా సెట్టంగ్స్, ఫీచర్లకు క్విక్ యాక్సెస్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ఈ సిరీస్‌లో టాప్ ఫీచర్‌గా నిలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* దీంతోపాటు ఇటీవల లీక్ అయిన వివరాల ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మోడల్స్ స్క్రాచ్ రెసిస్టెంట్ మరియు యాంటీ రిఫ్లక్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. MacRumors ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఉన్న సిరామిక్ షీల్డ్‌తో పోలిస్తే యాంటీ రిఫ్లక్టివ్ డిస్‌ప్లే తో మరింత ఎక్కువ మన్నిక ఉంటుందని భావిస్తున్నారు.
కేవలం ప్రో మోడల్స్ మాత్రమే ఈ కొత్త టెక్నాలజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్స్ సిరామిక్ షీల్డ్ తోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్టటికే ఆపిల్ ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్‌లో యాంటీ రిఫ్లక్టివ్ లేయర్‌ను ఉపయోగిస్తోంది.
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే ఎయిర్ మోడల్ మాత్రం టైటానియం ఫ్రేమ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఐఫోన్ 17 ప్రో మోడల్స్ A19 ప్రో చిప్‌సెట్ అదే ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్స్ A19 చిప్‌తో అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications







