Home
Mobile

రేపే ఆపిల్‌ ఐఫోన్‌ 17 సిరీస్‌ విడుదల.. తాజాగా కీలక వివరాలు లీక్‌..!

iPhone 17 Series : ఆపిల్‌ నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. ఐఫోన్‌ 17 సిరీస్‌ ను సెప్టెంబర్‌ 9 వ తేదీన లాంచ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ఐఫోన్‌ల గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. డిజైన్‌, చిప్‌సెట్‌, కెమెరాలు, బ్యాటరీ సహా అనేక అప్‌గ్రేడ్స్‌ను పొందవచ్చు.

కెమెరా ఫీచర్లు, థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ :
తాజాగా అందుబాటులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ఐఫోన్ 17 సిరీస్‌ ప్రో మోడల్స్‌ మెరుగైన కెమెరా ఫీచర్లతోపాటు థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం వేపర్‌ ఛాంబర్‌ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఓవర్‌ హీట్‌ కాకుండా మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

iPhone 17 series

8x ఆప్టికల్ జూమ్ :
ఐఫోన్‌ 17 ప్రో గురించి టిప్‌స్టర్‌ @jukanlosreve మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం X లో పోస్ట్ చేసి, అనంతరం తొలగించారు. 9to5Mac వివరాల ఆధారంగా ప్రో మోడల్స్‌ మెరుగైన టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 8x ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ స్మా్ర్ట్‌ఫోన్‌లు 5x ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో 48MP కెమెరా ను కలిగి ఉంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వివరాల ఆధారంగా ఐఫోన్‌ 17 సిరీస్‌ ప్రో మోడల్‌ కెమెరాలు మరింత జూమింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

కెమెరా అప్‌గ్రేడ్స్‌తోపాటు మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం వేపర్ ఛాంబర్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వివరాల ఆధారంగా ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌ కొత్త వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఉష్ణోగ్రతను క్రమంగా సర్దుబాటు చేసుకొనేందుకు వీలుగా ప్రత్యేక సిస్టమ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

A19 ప్రో చిప్‌సెట్! :
ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌ A19 ప్రో చిప్‌సెట్‌తో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఫలితంగా మెరుగైన పనితీరు అందిస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ప్రత్యేక థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ఉష్ణోగ్రత నిర్వహణ, వేడెక్కడాన్ని క్రమంలో నియంత్రిస్తోంది. కొత్త సిరీస్ మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో కూడిన సిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

Take a Poll

ఈ కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్‌ గేమింగ్, ప్రో రిజల్యూషన్‌తో కూడిన వీడియో షూటింగ్‌ సహా ఇతర సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది. ఫలితంగా గేమింగ్‌ సహా 8K వీడియో రికార్డింగ్ సహా ఇతర డిమాండ్‌ కలిగిన టాస్క్‌ల సమయాల్లో ఫోన్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఎప్పుడు విడుదల కానుంది :
ఐఫోన్‌ 17 సిరీస్‌ సెప్టెంబర్‌ 9 వ తేదీ రాత్రి 10:30 IST విడుదల కానుంది. అమెరికాలోని ఆపిల్‌ పార్క్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్‌ అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్‌ వీక్షించవచ్చు.

Best Mobiles in India

English summary
iPhone 17 Pro Models expected to get enhanced camera and Thermal upgrades
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X