2TB స్టోరేజీతో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. మూడు 48MP కెమెరాలు, A19 ప్రో చిప్‌సెట్..!
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను కూడా లాంచ్ చేసింది. Apple Awe Dropping ఈవెంట్‌లో వాచ్ 11 సిరీస్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ను కూడా విడుదల చేసింది. వీటితోపాటు ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ కూడా లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు తెలుసుకుందాం.
ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ వివరాలు :
ఐఫోన్ 17 ప్రో మోడల్ 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR ప్రో మోషన్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మ్యాక్స్ మోడల్ 6.9 అంగుళాల సూపర్ రెటీనా XDR ప్రో మోషన్ OLED డిస్‌ప్లేతో విడుదల అయింది.

ఈ రెండు మోడల్స్ 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ముందు, వెనుక వైపు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను పొందుతున్నాయి. ఈ షీల్డ్ స్క్రాచ్, క్రాక్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఐఫోన్ 17 ప్రో మోడల్స్ A19 ప్రో చిప్‌సెట్, N1 నెట్‌వర్కింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంది. వైఫై, బ్లూటూత్, థ్రెడ్స్ మరింత మెరుగైన పనితీరును అందిస్తాయి. ఎయిర్‌డ్రాప్, హాట్‌స్పాట్, గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరును అందిస్తుంది. iOS 26 పైన పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ లైవ్ ట్రాన్స్‌లేషన్, కాల్ స్క్రీనింగ్ సహా అనేక ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ప్రో మోడల్స్ 256GB మరియు అంతకంటే అధిక స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లు ప్రత్యేకమైన వేపర్ ఛాంబర్‌లను కలిగి ఉన్నాయి.
48MP + 48MP + 48MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్స్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సర్, 48MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరాను అమర్చారు. అయితే ప్రో మోడల్ 8x జూమ్ తో టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో మోడల్స్ శక్తివంతమైన చిప్‌సెట్, యూనిబాడీ డిజైన్ కారణంగా భారీ బ్యాటరీలతో అందుబాటులోకి వచ్చింది. అయితే కచ్చితమైన బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. మెరుగైన ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి. కేవలం 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.
ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ ధర, సేల్ :
ఈ రెండు మోడల్స్ ముందస్తు బుకింగ్‌లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి సేల్ ప్రారంభంకానుంది. ఐఫోన్ 17 ప్రో 256GB ధర రూ.1,34,900, 512GB వేరియంట్ ధర రూ.1,54,900, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.174900 గా ఉంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్ 256GB స్టోరేజీ ధర రూ.1,49,900, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,69,900, 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.189900, 2TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.229900 గా ఉంది.


Click it and Unblock the Notifications